ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటికే ఎలక్షన్స్ ని ద్రుష్టిలో పెట్టుకొని కొన్ని సినిమాలు తయారై విడుదలయ్యాయి. ఇందులో సోషల్ మీడియా వేదికగా విడుదలైన ‘వివేకం’ సినిమా జగన్ ఇమేజ్ పై బాగానే దెబ్బకొట్టింది. జగన్ కటుంబ రహస్య రాజకీయాలని వంశ వృక్షంతో సహా ఈ సినిమా అందరికీ అర్ధమయ్యేలా చూపించింది. బాబాయ్ మర్డర్ తో పాటు అనేక లోగుట్లు కూడా ఇందులో వున్నాయి.
ఇప్పుడు వైసీపీ పాలనలో అక్రమాలు, అవినీతి, డొల్లతనం ఎండగట్టె సినిమా విడుదలకు సిద్దమౌతోంది. నారా రోహిత్ హీరోగా రూపొందిన సినిమా ప్రతినిధి 2. జర్నలిస్ట్ మూర్తి సినిమాకి దర్శకత్వం వహించారు. ఇటివలే వదిలిన టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పుడీసినిమా ఎన్నికల హీట్ లో దించుతున్నారు. ఏప్రిల్ 25న విడుదల తేదిని ఖరారు చేశారు. ఈ ఐదేళ్ళ పాలనలో జరిగిన అధికార దుర్వినియోగం, అవినీతి, అక్రమాలు, పాలనలో డొల్లతనం కథాంశంగా తీసుకొని సినిమాని రూపొందించారు. టీజర్ చూస్తే ఆ విషయం అర్ధం అవుతోంది. ఇందులో చూపించిన కంటెంట్ సోషల్ మీడియాలో పక్కాగా వైరల్ కాబోతుందని తెలుస్తోంది. కొంతమంది వై. కా. పా ప్రభుద్ధులని పోలిన పాత్రలు ఈ సినిమాలో ఉన్నాయని, ఆ పాత్రల ద్వారా జగన్ పార్టీ డొల్ల తనం పూర్తిగా బయటపెట్టే ప్రయత్నం చేశారని సమాచారం.