తెలంగాణ హైకోర్టు కొట్టేసిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసు విషయంలో సుప్రీంకోర్టు ఉండవల్లికి షాక్ ఇచ్చింది. ఈ పిటిషన్ల విచారణను తిరిగి తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు పంపింది. టెక్నికల్ రీజన్స్‌తోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ష్టం చేసింది. కొన్ని విషయాల్లో బ్యాడ్ ప్రిసిడెన్సీ ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే పంపుతున్నట్లు ధర్మాసనం తెలిపింది. అదే సమయంలో కొన్ని కీలక సూచనలు కూడా చేసింది.
ఆరు నెలల్లో విచారణ చేపట్టి తుది నిర్ణయం వెలువరించాలని సుప్రీంకోర్టు ఈ సందర్బంగా తెలంగాణ హైకోర్టుకు సూచించింది. కోర్టులో కేసు విచారణ జరుగుతున్నంత కాలం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మీడియా ముందుకు వెళ్లక పోవడం మంచిదని సలహా ఇచ్చారు. సబ్‌జుడీస్ మేటర్‌లో సంయమనం పాటిస్తే మంచిదని బెంచ్ వ్యాఖ్యానించింది. అదే సమయంలో మార్గదర్శి నిజాయితీని ఎక్కడా శంకించడం లేదని స్పష్టం చేసింది.
కేసును తిరిగి తెలంగాణ హైకోర్టుకు పంపడమే కాకుండా.. ఉండవల్లిని ఈ కేసు విషయంలో మీడియాతో మాట్లాడవద్దని సూచించడం.. మార్గదర్శి నిజాయితీని ఎక్కడా శంకించడం లేదని చెప్పడంతో … ఈ పిటిషన్ అడ్డం పెట్టుకుని ఈనాడుపై దుష్ప్రచారం చేయాలనుకున్న వారికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనట్లే అనుకోవచ్చని భావిస్తున్నారు.