జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం కోసం వెళ్తే అభ్యర్థి రాకపోవడం ఉంటుందా ?. అసలు ఊహించగలరా ?. నిజంగా వైసీపీలో ఇవే జరుగుతున్నాయి. అద్దంకి నియోజకవర్గంలోని గ్రామాల మీదుగా బస్సు యాత్ర జరిగితే.. అభ్యర్థి పాణెం హనిమిరెడ్డి అడ్రస్ లేరు. అసలు జన సమీకరణ కాదు కదా.. ఎవరూ పట్టించుకోలేదు. అభ్యర్థి ఏడి అని వెదికితే ఎక్కడున్నారో కూడా ఎవరికీ తెలియలేదు.
ఆయన అదృశ్యం అవడం ఇదే మొదటి సారి కాదు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పుడు కూడా మూడు రోజులు కనిపించకుండా పోయారు. చివరికి వెదికి పట్టుకుని బతిమిలాడి తీసుకొచ్చి నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొనేలా చేశారు. ఆయన వైవీ సుబ్బారెడ్డి బిజినెస్ పార్టనర్. ఇప్పుడు మరోసారి కనిపించడం మానేశారు. ఈ వ్యవహారంతో ఒక్క సారిగా వైసీపీ వర్గాలు షాక్ కు గురయ్యాయి.
అద్దంకిలో బాచిన కుటుంబం పార్టీని ఐదేళ్లు చూసుకుంది. వారిని కాదని వైవీ సుబ్బారెడ్డి వ్యాపారభాగస్వామికి టిక్కెట్ ఇస్తే ఆయన తరచూ కనిపించకుండా పోతున్నారు. ఆయనది అసలు అద్దంకి కాదు. గుంటూరు జిల్లా పెదకూరపాడు. ఆయన వద్ద డబ్బుల లెక్కలు సరి చేసుకోవడానికి టిక్కెట్ ఇప్పించారని.. ఈ విషయం కనిపెట్టి.. ఆయన జంప్ అవుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అభ్యర్థిని మార్చకపోతే గొట్టిపాటి రవికి వాకోవర్ ఇచ్చినట్లేనన్న వాదన వైసీపీలో వినిపిస్తోంది.