వైసీపీ వెనుకుండి నడిపిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి అప్పుడే ఓటమికి కారణాలుచెప్పడం ప్రారంభించారు. నిష్ఫాక్షికంగా ఎన్నికలు జరిగితే వైసీపీదే విజయమని భారీ స్టేట్ మెంట్ ఇచ్చేశారు. ఎందుకు అంటే ఆఫీసర్లను బదిలీలు చేస్తున్నారని.. ఎన్నికల కమిషన్ వైసీపీకి ఎక్కువ నోటీసులు ఇస్తోందని ఆయన కారణాలు చెబుతున్నారు. అంటే ఆయన ఉద్దేశంలో ఇప్పుడు నిష్ఫాక్షికంగా ఎన్నికలు జరగడం లేదన్నమాట. అంటే ఓడిపోబోతున్నారని ఆయన పరోక్షంగా అంగీకరించినట్లయింది.
2019 ఎన్నికల సమయంలో వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న వారిని కూడా .. బదిలీ చేయించుకున్నారు వైసీపీ నేతలు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడం.. కొమ్ము కాస్తారని అనుకున్న వారినందర్నీ మెల్లగా సాగనంపే పనిలో ఉండటంతో ఆయన ఆందోళనకు గురవుతున్నట్లుగా కనిపిస్తోంది. తమకు అనుకూలంగా ఉండే అధికారులందర్నీ తీసేయడం.. ఈసీ కఠినంగా ఉండటం.. నిష్ఫాక్షికంగా ఉండటం కాదని ఆయన అనుకుంటున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు వైసీపీ పరిస్థితిని కళ్ల మందు ఉంచుతున్నాయి.
మరో వైపు అభ్యర్థులు చాలా చోట్లు చేతులు ఎత్తేస్తున్నారన్న ప్రచారం జరుగుతూండటంతో అభ్యర్థుల మార్పు ఉంటుందని ప్రచారం జరగుతోంది. అయితే అసలు అభ్యర్థులను మార్చబోమని అంటున్నారు. కొత్తగా పార్టీలో చేరిన వారు కేవలం వ్యక్తులేనన్నట్లుగా మాట్లాడుతున్నారు. నలుగురు చేరినంత మాత్రాన అభ్యర్థుల్ని మార్చే ప్రసక్తే లేదన్నారు. అంటే పార్టీలో చేరిన వారినందర్నీ పూచిక పుల్లలా తీసేశారన్నమాట. డబ్బులకు ఆశపడి పార్టీలో చేరుతున్న వారికి.. ఇక ఏ విలువ ఉండదని తేల్చేసినట్లయింది.