ఇదిగో మేనిఫెస్టో.. అదిగో మేనిఫెస్టో అని వైసీపీ నేతలు గత రెండు నెలలుగా చెబుతున్నారు. కానీ అలాంటి ఆలోచన కూడా ఉన్నట్లుగా ఇప్పుడు కనిపించడం లేదు. సిద్ధం సభల్లో మేనిఫెస్టో ప్రకటిస్తామని సుబ్బారెడ్డి లాంటి వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. సిద్ధం సభలు అయిపోయాయి.. మేమంతా సిద్ధం సభల వరకూ వచ్చారు. అయినా మేనిఫెస్టో జాడలేదు. బస్సుయాత్రలో ఉగాది రోజున మేనిఫెస్టో ప్రకటిస్తామన్నారు. కానీ ఆ ఆలోచన కూడా చేయలేదు.
వైసీపీ మేనిఫెస్టోను ప్రకటిస్తే.. గత మేనిఫెస్టో అంశం తెరపైకి వస్తుంది. మద్యనిషేధం దగ్గర్నుంచి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల వరకూ.. . ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. కానీ 98.5 శాతం నెరవేర్చామని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మళ్లీ అవే హామీలు ఇవ్వలేరు. ఇస్తే అమలు చేయలేదని తేలిపోతుంది. కొత్త హామీలు ఇద్దామంటే.. ప్రజలు నమ్మరని క్లారిటీ వచ్చింది. అందుకే రుణమాఫీ అంటూ.. హామీలు ఇద్దామని కసరత్తు చేస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తున్నారు కానీ ప్రకటించలేకపోతున్నారు.
తెలుగుదేశం పార్టీ మహానాడులో సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించి ఇంటంటికి తీసుకెళ్తోంది. ఉమ్మడి మేనిఫెస్టోపై మరో వైపు కసరత్తు చేస్తున్నా.. అసలు హామీలు మాత్రం ఊ సూపర్ సిక్సే. వీటిని నిరంతరాయంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో జగన్ చెప్పలేకపోతున్నారు. ఐదేళ్లలో చేసిన ఘన కార్యాలు అలాగున్నాయి మరి.