కాలేజీల నారాయణ…తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు.తాటాకు గుడిసె నుంచి ఆకాశమే హద్దుగా ఎదిగిన ఆయన ప్రస్థానం ఆదర్శనీయం. ఎంచుకున్న రంగంలో సక్సెస్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు.చిన్న గుడిసె నుంచి మొదలైన నారాయణ అతి సామాన్య జీవితం నేడు ఎంతోమందికి స్ఫూర్తి పాఠమైంది.
పొంగూరు నారాయణ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఆయన స్థాపించిన నారాయణ విద్యా సంస్థలే. విద్యా రంగంలో నారాయణ విద్యా సంస్థల సక్సెస్ రేటు చెప్పనక్కర్లేదు. కానీ, ఈ సక్సెస్ వెనక నారాయణ జీవితంలోని కష్టాలు ఉన్నాయి. కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడిన ఓ వీడియో తాజాగా సోషల్ మీడియాను ఊపేస్తోంది. అందులోని ఆయన ప్రసంగం అందర్నీ ఆలోచింపజేస్తోంది.
హరినాథపురంలోని ఓ తాటాకు గుడిసెలో ఉన్నానని.. తాను ఎమ్మెస్సీ చదివింది కూడా అదే తాటాకు గుడిసెలో అని చెప్పారు.ఆ చిన్న గుడిసె నుంచే ట్యూషన్ ప్రారంభించానన్నారు.తన మొదటి విద్యార్ధి ఆనం వెంకట రమణా రెడ్డి, ఆయన సోదరి అని.. వారందరికీ ట్యూషన్స్ అక్కడి నుంచి చెప్పానని.. ఆ తర్వాతే రేకులు, భవంతులు వచ్చాయని నారాయణ చేసిన ప్రసంగం ఎంతోమంది హృదయాలను తాకుతోంది.
సక్సెస్ ..ఒక్క రోజులోనే రావాలనేది నేటి యువత ఆలోచన.సక్సెస్ కు షార్ట్ కట్స్ వెతుక్కుంటున్నారు. ఈ నేపథ్యంలో నారాయణ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాటాకు గుడిసె నుంచి తరగతి గదులను శాసించే స్థాయికి ఆయన ఎదిగిన తీరు స్పూర్తిదాయకమని ప్రశంసిస్తున్నారు.
తాటాకు గుడిసె అనుభవాలను చెప్పిన నారాయణ… అలాంటి కష్టాలను తొలగించే ఉద్దేశ్యంతోనే టీడీపీ హయాంలో పేదలకు ఇళ్ళను నిర్మించే బాధ్యతను చంద్రబాబు తనకు ఇచ్చారని గుర్తు చేశారు. కాగా, ఈ ఎన్నికల్లో నారాయణ నెల్లూరు సిటీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ప్రచారానికి అనూహ్య స్పందన లభిస్తోంది. గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు.
Sir, just got to know you were the first student of Narayana garu
Nice to see Nellore TDP is one big family and everyone is cordially connected @anamramana
— బాబు కోసం (@trollycp) April 11, 2024