తమ పేరుతో ఫేక్ ప్రచారం చేస్తే ఎవరూ నమ్మడం లేదని ఈటీవీ పేరుతో ఫేక్ వీడియో క్రియేట్ చేసిన వైసీపీ సోషల్ మీడియాకు చాలా పెద్ద కష్టం వచ్చి పడేటట్లుగా ఉంది. ఈటీవీ యాజమాన్యం తెలంగాణ పోలీసులు ఫిర్యాదు చేసింది. ఈకేసును సీరియస్ గా తీసుకున్న తెలంగాణ సైబర్ సెల్ పోలీసులు.. ఐబీ సర్వే, ఆ పేరుతో ఫేక్ వీడియో ఎక్కడ క్రియేట్ చేశారు.. ఎవరు సర్క్యులేట్ చేశారన్న వివరాలన్నీ బయటకు తీశారు.
ఇలాంటివన్నీ ఐ ప్యాక్ సృష్టి అని చిన్న పిల్లవాడికి కూడా తెలుసు. అయితే పోలీసులకు ఎవరు క్రియేట్ చేశారు.. ఎవరు సర్క్యులేట్ చేశారన్నది కీలకం కాబట్టి.. టెక్నికల్ ఆధారాలన్నీ సేకరించారు. వాటిని సర్క్యూలేట్ చేయడంలో ప్రధాన పాత్ర పోషించింది వైసీపీ సోషల్ మీడియా అని కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. ఒకటి, రెండు రోజుల్లో వైసీపీ సోషల్ మీడియా బాధ్యులకు ఇంచార్జులు నోటీసులు ఇవ్వడమో లేకపోతే.. ఫేక్ ప్రచారాన్ని చేసిన వారిని అరెస్టు చేయడమో చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
వైసీపీ ఓ ఫేక్ ఫ్యాక్టరీనే నడుపుస్తోంది. ఎవరి క్రియేటివిటీ ప్రకారం వారి ఫేక్ న్యూస్ సృష్టించుకుంటున్నారు. అడ్డూ అదుపూ లేకుండా సాగుతున్న ఈ ఫేక్ న్యూస్ వ్యాప్తిపై ఈసీ కూడా ఏమీ చేయలేకపోతోంది. ఇంటలిజెన్స్ పోలీసులే ఈ ప్రక్రియలో భాగమయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ పోలీసులు కొంత మందిపై చర్యలు తీసుకున్నా చాలా మంది ఫేక్ న్యూస్ ప్రచారం చేయడాన్ని తగ్గిస్తారు.