తెలంగాణలో ట్యాపింగ్ కేసులో సాక్ష్యాల్లేవని పోలీసులు మెల్లగా లీకులు ఇస్తున్నారు. ట్యాపింగ్ ద్వారా చేసిన తప్పుడు పనులుక సాక్ష్యాలు కనిపిస్తున్నాయి కానీ అసలు ట్యాపింగ్ చేశారన్నదానికి సాక్ష్యు లేవని పోలీసుల నుంచి సంకేతాలు వస్తున్నాయి. ప్రణీత్ రావు హార్ డిస్కులు, సీసీ కెమెరాల ఫుటేజీ ధ్వంసం చేశారు. హార్డ్ డిస్కుల్ని మూసి నుంచి స్వాధీనం చేసుకున్నారు. కానీ ప్రణీత్ రావు ఎలా ధ్వంసం చేస్తే రీట్రీవ్ చేయలేరో అలా ధ్వంసం చేసినట్లుగా తేల్చారు. అంటే వాటి నుంచి రికవరీ సాధ్యం కాదు. .. దీనర్థం సాక్ష్యం లేదనే.
తాజాగా నెల రోజులకుపైగా విచారణ జరిపిన తర్వాత కేవలం అరెస్టు చేసిన అధికారుల వాంగ్మూలాలనే ఆధారంగా కోర్టుకు సమర్పించబోతున్నట్లుగా చెబుతున్నారు. ట్యాపింగ్ పరికరాలు కానీ.. ట్యాపింగ్ పరికరాలు సమకూర్చిన వ్యక్తిని కాని .. లేదా ట్యాపింగ్ ద్వారా సేకరించిన డేటా కానీ లేకుండా… కేవలం వాంగ్మూలాల ఆధారంగా… కేసును నడపడం సాధ్యమా అనే డౌట్ పోలీసులకు కూడా వస్తోంది. అందుకే మెల్లగా ట్యాపింగ్ కేసు కాకుండా.. ట్యాపింగ్ చేసి ఏం చేశారన్నదానిపై లీకులు ఇస్తున్నారు. చేసిన తప్పుడు పనులకు ఆధారాలు ఉన్నాయని అంటున్నారు కానీ.. అసలు ఆ నేరాలు ట్యాపింగ్ కు పాల్పడటం ద్వారా చేశారన్న దానికి ఇప్పుడు సాక్ష్యం చూపించాల్సి ఉంటుంది.
ట్యాపింగ్ పూర్తి అనధికారికం. ఇలా ట్యాపింగ్ చేసిన సమాచరాన్ని పెన్ డ్రైవులు వంటి వాటి ద్వారా ప్రభుత్వ పెద్దల వద్దకు తీసుకెళ్లేవారు. అంటే.. అసలు సోర్స్ నుంచి కాపీ చేసినట్లే. ఆ కాపీ చేసిన డ్రైవ్స్.. దొరికితే చాలు కథ కొలిక్కి వస్తుందని అనుకుంటున్నారు. అవి దొరికాయని ఎక్కడా చెప్పడం లేదు. ప్రస్తుతం పోలీసుల వైపు చూస్తూంటే.. అంతని..ఇంతని చివరికి ట్యాపింగ్ కేసులో ఆధారాల్లేని కేసుగా మారుస్తారన్న సందేహాలు ప్రారంభమవుతున్నాయి. నిజానికి దేశంలో ఇప్పటి వరకూ టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం ఒక్క కేసు కూడా నమోదవలేదు , కారణం ఆధారాల్లేకపోవడమే.