ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై దాడి జరిగినప్పుడు.. వందల మంది ఉండే ఆయన భద్రతా వ్యవస్థ వెంటనే స్పందించాలి. ఆయనపై దాడి జరిగిన వారిని పట్టుకోవాలి.. ఆయనపై దాడి చేసిన వస్తువుల్ని జాగ్రత్తగా సేకరించాలి. వీటన్నింటి విషయంపై వారికి ట్రైనింగ్ ఉంటుంది. అయినా జగన్ పై జరిగినట్లుగా చెబుతున్న దాడి తర్వాత ఒక్కటంటే ఒక్క ఆధారం సేకరించేందుకు పోలీసులు ప్రయత్నించలేదు. చివరికి రాయిని కూడా సేకరించలేదు.
అసలు జగన్ పై దాడి జరిగిందా లేదా అన్నదానిపైనా అనేక సందేహాలున్నాయి. సాక్షి టీవీలో రాయి వస్తోందని మార్క్ చేసి చూపిస్తున్నారు కానీ.. మరే వీడియో దృశ్యాల్లోనూ రాయి కనిపించడం లేదు. స్కూల్ వైపు నుంచి వచ్చిందని సాక్షి మీడయానే చెబుతోంది. క్యాడ్ బాల్ తో కొట్టారని కూడా వాళ్లే చెబుతున్నారు. ఓ సారి ఎయిర్ గన్ కూడా వాడారని ప్రచారం చేస్తున్నారు. ఈ కథలన్నీ పోలీసులతో చెప్పిస్తారేమో కానీ కనీస సాక్ష్యం లేకపోతే నవ్వుల పాలవుతారు. ముందు ప్రధాన సాక్ష్యంగా రాయిని సేకరించాలి..అలాంటి పని చేయలేదు.
అసలు జగన్ పై రాయి దాడే జరగలేదన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అంతకు ముందు జగన్ కు ఓ గజ మాల వేశారు. ఆ గజ మాల చెందిన హుక్.. ఆయన మొహం మీద పడిందన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పుడే ఆయనకు గాయమయిందని చెబుతున్నారు. ఆ తర్వాత రాయి పడినట్లుగా యాక్షన్ చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలా చెప్పుకోవడానికే.. సెక్యూరిటీ అందర్నీ కూర్చోబెట్టారని.. లైట్లు సహా.. అన్నీ ఆపేశారని భద్రతా వ్యవస్థ మొత్తం కళ్లు మూసుకుందన్న ఆరోపణలు వస్తున్నాయి.
పోలీసులు హత్యాయత్నం కేసులు పెట్టి.. రాజకీయ కథలు చెప్పడానికి రెడీ అయ్యారు. రోజంతా వారు ఏమీ మాట్లాడలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ రెడీ చేయలేదేమో కానీ.. సాక్షి మీడయా కథనాల్లో చెబుతున్నట్లుగా హత్యాయత్నం కేసు పెట్టారు. అసలు కథలు.. ఇవాళో రేపో పోలీసులు చెప్పే అవకాశం ఉంది. విజయవాడ సీపీ జగన్ రెడ్డికి వీర భక్తుడిగా ఇప్పటికే పెద్ద పేరు తెచ్చుకున్నారు.