ఏపీలో 2019 నుంచి వైసీపీ ఓ కొత్త సంప్రదాయానికి తెరతీసినట్లు కనిపిస్తోంది.ఎన్నికల్లో గట్టేక్కేందుకు ఓ కొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. గత ఎన్నికలకు ముందు కోడికత్తి డ్రామాతో ఇది జగన్ పై హత్యాయత్నం అంటూ పెద్దఎత్తున ప్రచారం చేసుకొని సానుభూతి పొందారు. అది ఆ ఎన్నికల్లో వైసీపీ గెలుపుకు బాగానే వర్కౌట్ అయింది. ఈసారి వైట్ నాట్ 175అంటూ గంభీర్యం ప్రదర్శిస్తోన్న వైసీపీకి అడుగడుగునా చేదు అనుభవమే ఎదురు అవుతోంది. జగన్ బస్సుయాత్రపై ఆ పార్టీ అభ్యర్థులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. కానీ, బస్సు యాత్ర పేలవంగా సాగుతోంది.
ఈ నేపథ్యంలోనే జగన్ పై శనివారం రాత్రి దాడి జరిగింది.ఎప్పటిలాగే వైసీపీ నేతలు గుండెలు బాదుకునేంత పని చేశారు. స్కిప్ట్ మేరకు టీడీపీ,జనసేనపై ఆరోపణలు చేశారు. అయితే, గత ఎన్నికలకు ముందు వైసీపీ అనుసరించిన వ్యూహాన్ని మరోసారి ఆచరణలో పెట్టేశారన్న ఆరోపణలు వస్తున్నాయి.
కోడికత్తి డ్రామాకు బదులుగా ఈసారి గులకరాయి డ్రామాను షురూ చేశారన్న అనుమానాలు వచ్చాయి. ఎందుకు సరిగ్గా ఎన్నికల సమయంలోనే జగన్ పై దాడులు జరుగుతున్నాయి. ఎన్నికల సమయంలో మాత్రమే జగన్ జనాల్లో ఉంటున్నారా..? అంటే అది లేదు. అయినా.. భారీ బందోబస్తు మధ్య ఉండే జగన్ పై దాడి ఎలా జరిగింది..? ఇది ఐ ప్యాక్ ప్లాన్ అనే సందేహాలు కలుగుతున్నాయని జనాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
జగన్ పై దాడి జరిగిన ఒక రోజు వ్యవధిలోనే పవన్ , చంద్రబాబులపై దాడికి యత్నించడం పలు సందేహాలకు కారణం అవుతోంది. ఒక్క జగన్ పైనే ఎన్నికలకు ముందు దాడులు ఎలా జరుగుతున్నాయన్న ప్రశ్నలు వెలుగులోకి వస్తుండటంతోనే… చంద్రబాబు, పవన్ పై దాడులకు ప్లాన్ జరిగిందా..? అనే కోణంలో చర్చలు జరుగుతున్నాయి. వైసీపీపై వస్తోన్న అనుమానాలకు తెరదించేందుకే ఈ రకమైన దాడులు జరుగుతున్నాయా..? అని ఆ పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇలాంటి దాడులు కామన్ గా మారుతుండటం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.