ఐపీఎల్‌లో తన రికార్డుని తానే బద్దలు కొట్టుంది హైదరాబాద్ జట్టు. ముంబైపై కొన్ని రోజుల క్రిందట నెలకొల్పిన అత్యధిక పరుగుల రికార్డుని ఇప్పుడు బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెరిపివేసింది. 287 పరుగుల భారీ స్కోరు సాధించి, చరిత్ర సృష్టించింది. ఈ సీజన్‌లోనే ముంబైతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 277 ల స్కోరు సాధించింది. ఆ స్కోరు దాటడం ఇప్పట్లో ఏ జట్టుకీ సాధ్యం కాదు అనుకొనే లోపలే, ఆ రికార్డుని స్వయంగా బద్దలు కొట్టింది.
ఈరోజు చినస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగాచెలరేగారు. హెడ్ (102), క్లాసన్ (67), అభిషేక్ (34), మార్‌క్రమ్ (32 నాటౌట్), సమద్ (37 నాటౌట్) పరుగులతో బ్యాటింగ్ తో అదరగొట్టారు. హైదరాబాద్ బ్యాటర్లు ఏకంగా 22 సిక్సులు బాదారు. బ్యాటింగ్ కి దిగిన ప్రతి ఒక్కరూ కనీసం 2 సిక్సులు కొట్టడం విశేషం. ఇన్నింగ్స్ మధ్యలో పరుగులు కాస్త నెమ్మదించాయి. లేదంటే 300 పరుగుల మైలు రాయిని అందుకొనేదే. ఈ సీజన్‌లో 300 స్కోరు చూసినా ఆశ్చర్యం లేదు.