ఏపీలో పోలీసు వ్యవస్థ ఎలా అయిపోయిందంటే.. సీఎంపై రాయి పడిందంటే.. . ఆ రాయిని కూడా స్వాధీనం చేసుకోవాలన్న ఆలోచన లేనంత మైండ్ మొద్దుబారిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు. అరచేతిలో ఇమిడిపోయేంత రాయితే కింద నుంచి ఎవరో విసిరితే.. జగన్ రెడ్డి తలకు తగిలి బౌన్స్ అయి.. వెల్లంపల్లి కంటికి తగిలి కింద పడింది. అది ఎక్కడో పడదు… తగిలిన వారి దగ్గరే పడుతుంది. బస్సు మీదనే పడుతుంది. కానీ ఆ రాయిని ఎవరూ గుర్తించలేదు. ఎవరూ స్వాధీనం చేసుకోలేదు. కేసులో మొదటి సాక్ష్యం అదే అవుతుంది.
పద్నాలుగు వందల మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని విజయవాడ సీపీ చెప్పారు. అంత మంది ఉంటే.. కనీసం దాడి చేసిన రాయిని కూడా ఎందుకు స్వాధీనం చేసుకోలేదు.. ఇప్పుడు ప్రెస్ మీట్లలో అరచేయి అంత రాయి అని ఊహాగానాలతో చెప్పడం ఎందుకు ?. దాడి జరిగినప్పుడు … పద్నాలుగు వందల మంది పోలీసులు ఉంటే… ఆ సరౌండింగ్స్ మొత్తాన్ని బ్లాక్ చేసి ఉంటే.. నిందితుడు అక్కడే ఉండేవాడు కదా.. పట్టుకోవడం ఎంత సేపు ?
ఎలా చూసినా పోలీసులు రక్షణ పరంగానే కాదు.. దాడి తర్వాత వ్యవహరించిన విధానంపైనా అనేక అనుమానాలు ఉన్నాయి. అసలు రాయి దాడి జరగకుండా డ్రామా అయినా ఆడి ఉండాలి.. లేకపోతే పోలీసుల సాయంతోనే ఈ డ్రామాను రక్తి కట్టించి ఉండాలి… అందుకే పవన్ కల్యాణ్ ఇలాంటి పోలీసులతో ఎలా దర్యాప్తు చేయిస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు.ప్రజల డౌట్ కూడా అదే.