డబ్బుతో ఏమైనా చేయవచ్చా ?. ఏమీ చేయలేరని చాలా ఘటనలులు నిరూపించాయి. చివరికి ఎన్నికల్లో కూడా గెలవలేరని.. డబ్బులు విచ్చలవిడిగా పంచినా.. బీఆర్ఎస్ ఓటమి నిరూపించింది. అయినా వైసీపీ తమ చివరి ప్రయత్నంగా డబ్బులనే నమ్ముకుంటోంది. చిన్న స్థాయి నేతల దగ్గర్నుంచి .. నియోజకవర్గ ఇంచార్జుల వరకు ఎంత కావాలంటే అంత ఇచ్చి పార్టీలో చేర్చుకుంటోంది. సోషల్ మీడియా ఖాతాల్లో నెగెటివ్ ప్రచారం చేసే వాళ్లుంటే వెంటపడి డబ్బులిచ్చి పాజిటివ్ గా ప్రచారం చేయమని కోరుతున్నారు.
వైసీపీ నుంచి ద్వితీయశ్రేణి నేతల వలస వెల్లువలా ఉంది. వైసీపీలోనూ చేరికలు ఉన్నాయని చెప్పుకోవడానికి నేతల్ని కొనుక్కుటున్నారు. విజయవాడ నుంచి ఓ నేతను చేర్చుకోవడానికి ఐదు కోట్లు ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. వైసీపీలో చేరిన ప్రతీ నేతకు ఓ ప్యాకేజీ ఇచ్చారు. కానీ వారెవరూ … జగన్ కు కానీ.. వైసీపీకి కానీ ఓటు వేయరు.. వేయించరన్న సంగతిని గుర్తించడానికి సిద్ధంగా లేరు. స్వతహాగా అభిమానం లేని వారు ఓట్లు కూడా వేయరు.
చేరికల విషయంలోనే కాదు.. తమ గురించి వ్యతిరేకంగా ప్రచారం జరగకుండా వైసీపీ నేతలు పూర్తిగా డబ్బునే నమ్ముకున్నారు. వ్యతిరేక వార్తలు రాకుండా డబ్బులతో వల వేస్తున్నారు. ప్రధాన టీవీ చానళ్లను.. యూట్యూబ్ చానళ్ల స్థాయికి దిగజార్చి.. తాము మాత్రమే కనిపించేలా.. ఇంకెవరూ కనిపించకుండా చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు చిన్న చిన్న సోషల్ మీడియా ఖాతాలైనా గురి పెట్టి .. డబ్బుల పండగ చేస్తున్నారు. వీరంతా జగన్ భజన చేయవచ్చేమో కానీ.. ప్రజాభిప్రాయాన్ని మార్చలేరని వైసీపీ ఎందుకు నమ్మేలేకపోతోంతో…గత అనుభవాలు బాగా తెలిసిన వైసీపీ నేతలు గింజుకుంటున్నారు.
అనేక మీడియా చానళ్లకు తప్పుడు సర్వేలు వేయమని డబ్బులు ఆశ చూపుతున్నారు. వేసే వారు వేస్తారు.. కానీ ప్రజాభిప్రాయం ఆ సర్వేలకే మారదని.. వైసీపీ పెద్దలు ఎందుకు గుర్తించలేకపోతున్నారో కానీ.. అడ్డగోలుగా సంపాదించిన డబ్బును మాత్రం విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ఈ డబ్బులన్నీ ప్రజలకు మెరుగైన సేవ చేయడానికి ఉపయోగించి ఉంటే.. ఎంతో కొంత ప్రజాదరణ కనిపించి ఉండేది.