బాలయ్య వందో సినిమా సంక్షోభం ఇంకా వీడలేదనే చెప్పాలి. మొన్నటిదాకా ఆదిత్య 369 సీక్వల్ తన నూరో సినిమా అని చాటింపేసిన బాలయ్యే ఇప్పుడు దానికన్నా వేరే కథలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే తాజాగా క్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ రైతు కథ చెప్పండం దానికి బాలయ్య ఓకే చెప్పేయడం జరిగిందట. ఇక ఇంతలోనే అమరావతిని ఏలిన చక్రవర్తి ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ జీవిత కథతో ఓ సినిమా చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు సమాచారం. అమరావతి రాజు కథని క్రిష్ డైరక్షన్లో చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.
సో ఓ వైపు రైతు, మరోవైపు రాజు కథలతో సిద్ధమవుతున్న బాలయ్య ఫైనల్ గా దేనికి ఓటేస్తాడు అని అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మార్చ్9 అమావాస్య తర్వాత తన వందో సినిమా వార్త ప్రకటిస్తానని చెప్పిన బాలయ్య, ఏ సినిమా గురించి ప్రకటిస్తాడా అని పరిశ్రమ వ్యక్తులు కూడా ఎదురు చూస్తున్నారు. మరి బాలయ్య వందో సినిమా గురించి ఆయన మాటల్లోనే త్వరలో ఓ న్యూస్ అయితే బయటకు వస్తుంది. ఇంతకీ బాలయ్య చేసేది రైతుగానా.. రాజుగానా అనేది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే..!