కార్యనిర్వాహక ఉత్తర్వులతో నియమితులై క్యాబినెట్ మంత్రి హోదాలో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వ ఏకీకృత నిధి నుండి జీత భత్యాలు పొందుతున్న దాదాపు 40 మంది ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుంది స్పష్టం చేస్తూ భారత ఎన్నికల సంఘం మంగళవారం ఆదేశాలు జారీచేసింది.
ప్రభుత్వ సలహాదారుల ప్రవర్తనకు సంబంధించి కమిషన్కు అనేక ఫిర్యాదులు అందాయని, నిర్దేశిత పనికి బదులుగా, వారు రాజకీయ ప్రచారం/రంగంలోకి ప్రవేశిస్తున్నారని మరియు ప్రతిపక్ష పార్టీలను విమర్శిస్తూ విలేకరుల సమావేశాలను కూడా నిర్వహిస్తున్నారని కమిషన్ గుర్తించింది. వివరణాత్మక సమీక్ష తదుపరి ప్రభుత్వ మంత్రికి వర్తించే విధంగా ఈ సలహాదారులకు కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందని ఈసీఐ స్పష్టంచేసింది. కమిషన్ యొక్క ఈ ఆదేశాలను ఏమాత్రం ఉల్లంఘిచినా తీవ్రంగా పరిగణిస్తూ సంబంధిత చట్టాలకు లోబడి కఠినమైన చర్యలను తీసుకోవడం కూడా జరుగుతుంది ఈసీఐ స్పష్టం చేసింది.
సలహాదారులందరిలోకి చీఫ్ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. మిగతా అందరికీ సలహాదారు పదవులు ఇప్పించేది కూడా ఆయనే. ఆయన చేస్తున్నదే రాజకీయం. వైసీపీ అభ్యర్థుల ప్రకటన దగ్గర్నుంచి వైసీపీ వ్యవహారాలన్నీ చక్క బెడుతున్నారు. ప్రెస్ మీట్లు పెట్టి టీడీపీ.. బీజేపీని విమర్శిస్తున్నారు. చివరికి ప్రధాని మోదీ సభపైనా కామెంట్లు చేశారు. కానీ ఆయన కు ఏ రూల్స్ వర్తించడం లేదు. ఇతర సలహాదారుల గురించి చెప్పాల్సిన పని లేదు. వారు నేరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
ఇంత కాలం కోడ్ ఉల్లంఘించిన దానికి సజ్జలపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇప్పుడు సజ్జల పార్టీ తరపున ప్రెస్ మీట్ పెట్టాలంటే రాజీనామా చేయాల్సి ఉంటుంది. చేస్తారా లేకపోతే.. ఈసీ తమకు బాగా తెలుసని సైలెంట్ గా ఉంటారో చూడాల్సిఉంది.