కేసీఆర్ అన్న కొడుకు కన్నారావుపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే ల్యాండ్ కబ్జా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లో ఉన్న కాన్నారావు దౌర్జన్యాలు ఒక్కోటిగా బయటకు వస్తున్నాయి. పోలీసు అధికారులతో కలిసి కన్నారావు చేసిన సెటిల్మెంట్ బాధితులు ఒక్కొక్కరుగా ఫిర్యాదు చేస్తున్నారు.
తనకు న్యాయం చేయాలంటూ విజయ వర్ధన్ రావు అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి కన్నారావును ఆశ్రయించారు. తన వద్ద భారీగా బంగారం ఉందని తెలుసుకున్న కన్నారావు బిందు మాధవి అలియాస్ నందిని చౌదరి అనే మహిళతో కలిసి న్యాయం చేయాలని వచ్చిన వ్యక్తికే ఎసరు పెట్టారు. ఓ గెస్ట్ హౌజ్ లో నిర్బంధించి, బెదిరించి ఏకంగా 60లక్షల నగదు, 97 తులాలా బంగారాన్ని లాక్కున్నట్లు బాధితుడు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.
కన్నారావు, శ్యామ్ ప్రసాద్, నందిని చౌదరి కలిసి ఇదంతా చేశారని, టాస్క్ ఫోర్స్ అధికారి భుజంగ రావు, ఏసీపీ కట్టా సాంబయ్య తమకు క్లోజ్ అంటూ వారు బెదిరించారని విజయ వర్ధన్ పేర్కొన్నారు.
దీంతో బంజారాహిల్స్ పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తుండగా… ఇలాంటి కేసులు మరిన్నీ నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.