లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ షుగర్ లెవల్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది ఈడీ. వైద్య పరమైన సాకులతో బెయిల్ పొందేందుకుగాను కేజ్రీవాల్ మామిడిపండ్లు, స్వీట్లు ఉద్దేశ్యపూర్వకంగా తింటున్నారని సంచలన ఆరోపణలు చేసింది.
తన బ్లడ్ షుగర్ లెవల్స్ హెచ్చు తగ్గులకు గురి అవుతున్నాయని తన ఆరోగ్యంపై కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. వారానికి మూడు సార్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్యుడిని సంప్రదించేందుకు తనకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కేజ్రీవాల్ దాఖలు చేసిన ఈ పిటిషన్ పై ఈడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. షుగర్ లెవల్స్ పెంచుకునేందుకు కావాలనే మామిడిపండ్లు, స్వీట్లు తింటున్నారని.. తద్వారా షుగర్ లెవల్స్ ను సాకుగా చూపి బెయిల్ పొందేందుకు ఎత్తుగడ వేసినట్లుగా ఆరోపించారు.
ఈడీ తరఫు న్యాయవాది వాదనలను కేజ్రీవాల్ తరఫు న్యాయవాది ఖండించారు. ఇలాంటి తరహ ఆరోపణలు మానుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. కేజ్రీవాల్ కు అందిస్తోన్న ఆహారంపై తమకు రిపోర్ట్ ను సమర్పించాలని జైలు అధికారులను ఆదేశిస్తూ తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.