తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదు తర్వాత అంత పెద్ద నగరంగా వరంగల్ కు ఒక కొత్త దశ దిశ నిర్దేశిస్తాం అంటూ తెరాస పెద్దలు గుప్పించిన హామీలు ఫలితం ఇచ్చాయి. గులాబీ పార్టీకి వరంగల్ ప్రజలు కార్పొరేషన్ ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీని కట్టబెట్టారు. మొత్తం 58 డివిజన్లు ఉన్న ఈ కార్పొరేషన్లో 40 స్థానాల్లో తెరాస విజయం ఖరారైంది. మొత్తం వీరికి 45 స్థానాలకు పైగా దక్కవచ్చుననే అభిప్రాయం వినిపిస్తోంది.
ఇంకా కౌంటింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రత్యర్థులు కాంగ్రెస్కు 1, వామపక్షాలకు 1, ఇండిపెండెంట్ కు 1 స్థానాలు మాత్రం దక్కడం విశేషం.
వరంగల్ ఎంపీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితాలను గమనించిన ఎవ్వరైనా సరే.. కార్పొరేషన్ ఫలితాలు అందుకు భిన్నంగా ఉంటాయని ఊహించలేరు. అలాంటి నేపథ్యంలో ఊహలకు అందని స్థాయిలో ఇక్కడ కూడా తెరాస విజయం సాధించింది. 58 డివిజన్లున్నచోట 45కు పైగా గెలుచుకోవడం అనేది అనూహ్యంగానే తెలుస్తోంది.