ఏపీలో వ్యవహారాలన్నీ గీత దాటిపోతున్నాయి. ఎన్నికలకోడ్ ఉన్నా.. రాజారెడ్డి రాజ్యాంగమే అమలవుతోంది. ఐపీసీ సెక్షన్ల కాకుండా జేపీసీ సెక్షన్లతో పోలీసులు రాజకీయ కేసులు పెట్టేస్తున్నారు. అమాయకుల్ని బలి చేస్తున్నారు. మరో వైపు శాంతిభద్రతల సమస్య రోజు రోజుకు పెరుగుతోంది. డీజీపీ ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నారు. సీఎస్ … రాజ్యాంగానికి అతీతంగా.. జగన్ రెడ్డే తన బాస్ ఆయన చెప్పిందే రాజ్యాంగం.. చేసిందే శాసనం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కానీ వీరిని మార్చడం లేదు. ఇదిగో మార్పు.. అదిగో మార్పు అంటున్నారు కానీ మార్చడం లేదు.
ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చింది. నామినేషన్ల ప్రక్రియ. ప్రారంభమయింది. అభ్యర్థులుగా పోటీ చేసే వారు తమపై ఉన్న కేసుల వివరాలు అడిగితేనే ఇవ్వడానికి నిరాకరించారు. పోలీస్ సేవా యాప్ ఆపేశారు. చివరికి కోర్టుకెళ్లి ఆదేశాలు తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నతాధికారులు ఎవరూ నిష్పక్షిపాతంగా పని చేసే అవకాశం లేదు . ఎన్నో ఫిర్యాదులు విపక్షాలు ఇచ్చినప్పటికీ.. ఈసీ కనీసం స్పందించలేదు. లీకులు మాత్రం వస్తున్నాయి.
జవహర్ రెడ్డిని… రాజేంద్రనాథ్ రెడ్డిని మార్చి సీనియర్లుగా తర్వాతి స్థానాల్లో ఉన్న సిసోడియా, ద్వారకా తిరుమలరావును నియమిస్తారని చెబుతున్నారు. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తి వేస్తే సీనియార్టీలో ఆయన ముందు ఉంటారు. ఆయనకు డీజీపీ పోస్టు రావాలని టీడీపీ నేతలు కోరుకుంటారు. ఆయనకు ఇచ్చినా ఇవ్వకపోయినా… ముందు అధికారుల్ని మార్చకపోతే.. ఎన్నికలు సజావుగా సాగవన్న అనుమానం మాత్రం బలంగా ఉంది.