ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది ఈసీ. ఆయన వైసీపీ కోసం ఎన్నికల ప్రచారం చేయడంతో నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఆయనను అమరావతి దాటి వెళ్లవద్దని ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన తప్పు చేసింది కాకుండా.. ఈసీ పైనే ఎదురుదాడి చేసేందుకు ప్రయత్నించారు. తనపై తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నారని ఈసీకే ఫిర్యాదు ఇచ్చారు.
ఆయనకు సీఎస్ సహకరించారు.కానీ ఈసీతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపించారు. సీఎస్ తొక్కి పెట్టిన సస్పెన్షన్ ఆర్డర్స్ ను ఎట్టకేలకు రిలీజ్ చేయక తప్పలేదు. ఆయన హెడ్ క్వార్టర్ అంటే అమరావతి దాటి వెళ్లకూడదని కూడా ఆదేశాలిచ్చారు. ఇప్పుడు ఆయన ఉద్యోగ సంఘం పదవి కూడా రిస్క్ లో ఉంది. అంతే కాదు.. ఉద్యోగం నుంచి ఆయనను డిస్మిస్ చేయడానికి అవసరమైన సాక్ష్యాలు కూడా ఉన్నాయని.. ప్రభుత్వం మారగానే ఆయన అన్నీ పోగొట్టుకుని జగన్ రెడ్డి ఇంటి ముందు ఉండాల్సిందేనని అంటున్నారు.
ఉద్యోగ సంఘం నేతల్లో వెంకట్రామిరెడ్డి జగన్మోహన్ రెడ్డి పాలేరుగా వ్యవహరించారు. టీడీపీ సర్కార్ లో ఫైల్స్ చోరీ చేసిన కేసు కూడా ఆయన మీద ఉంది. జగన్ సీఎం అయ్యాక ఆయన చెలరేగిపోయారు. ఇప్పుడు ఆయన ఉద్యోగం కూడా రిస్క్ లో పడిపోయింది. ప్రభుత్వం మారిన తర్వాత ఆయన జగన్ పార్టీ నాయకుడిగా పని చేసుకోవాల్సిందేనన్న అభిప్రాయం ఉద్యోగుల్లో వినిపిస్తోంది.