ఏపీలో సలహాదారులకు కూడా కోడ్ వర్తిస్తుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ప్రభుత్వ సలహాదారు రాజకీయ వ్యవహారాలు మాట్లాడేందుకు వీలు లేదు. అయినా సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో చిటా చాట్ గా మాట్లాడి కూలి మీడియాలో తన మాటల్ని బ్రేకింగ్ రూపంలో వేయించుకున్నారు. సలహాదారు పదవి వదలేసి ఆయన రాజకీయాలు చేయవచ్చు కదా..ఇంకా ఒక్క నెలే కదా.. మళ్లీ గెలిస్తే సలహాదారే అవుతారు కదా అనే డౌట్ చాలా మందికి వస్తోంది.కానీ సజ్జల మాత్రం రాజీనామా చేసే ప్రశ్నే లేదంటున్నారు.
మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మతో రాజీనామా చేయించారు. కానీ సజ్జల మాత్రం చేయడం లేదు. పార్టీలోనే కాదు ప్రభుత్వంలోనూ సజ్జల రామకృష్ణారెడ్డి అత్యంత కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయననుషాడో సీఎం అని విపక్షాలు విమర్శిస్తూ ఉంటాయి. ప్రస్తుతం సీఎం జగన్ బస్సు యాత్రలో ఉంటే.. వ్యవహారాలన్నీ ఆయనే చక్క బెడుతున్నారని చెబుతున్నారు.
సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి కేసులో రాజకీయ వ్యూహాలు ఆయన చేస్తున్నారు. ఆయన ముఖ్య సలహాదారుగా ఉండబట్టే.. ప్రభుత్వంలోని కీలక విభాగాల అధికారులు ఆయన ఆదేశాలను పాటిస్తున్నారని చెబుతన్నారు. ఇలాంటి సమయంలో ఆయన తన పదవికి రాజీనామా చేస్తే.. అధికార యంత్రాంగంపై గ్రిప్ పోతుందన్న ఆందోళనలో వైసీపీ ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అందుకే రాజీనామా చేసేది లేదని.. తెర వెనుక తప్పుడు పనులు మాత్రం కంటిన్యూ చేస్తామని చెబుతున్నట్లుగా వ్యవహారాలు నడుస్తున్నాయి.