చంద్రబాబునాయుడు .. అభివృద్ధి రాజకీయాలు, యువతకు ఉపాధి, టెక్నాలజీ విషయాల్లో ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే అద్భుతాలు చేయవచ్చని నిరూపించిన నాయకుడు. ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు… ఆయన చేసిన పనులన్నీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు గుర్తు చేసుకున్నారు. ఆయన సంస్కరణతో ఉద్యోగాలు సాధించుకున్న వారు కుటుంబాలను బాగు చేసుకున్న వారు ఇదేం కుట్రలని బాధపడ్డారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలున్న ప్రతి మధ్యతరగతి కుటుంబం ఆయన వేసిన పునాదుల్ని.. ఆయన పడిన కష్టాన్ని అందరితో పంచుకున్నారు.
అది చంద్రబాబునాయుడు బ్రాండ్. రాజకీయాలంటే ప్రజలకు మేలు చేయడానికేనని నమ్మే లీడర్. ఏదో గాలిలో అభివృద్ధి జరిగిపోయిందని వాదించే వారికి.. ఓ అహ్మదాబాద్ ఎందుకు ఐటీ హబ్ కాలేదు.. ఓ లక్నో ఎందుకు కాలేదు.. ఓ కోల్ కతా ఎందుకు కాలేదు.. ఓ అమృత్ సర్ ఎందుకు కాలేదు.. ఓ భోపాల్ ఎందుకు కాలేదు.. ఓ జైపూర్ ఎందుకు కాలేదు.. ?, ఎందుకు కాలేదు అంటే.. అక్కడ చంద్రబాబు వంటి ముఖ్యమంత్రి లేరు. వచ్చిన అవకాశాల్ని అంది పుచ్చుకుని ప్రజల జీవితాల్ని బాగు చేయాలన్న సంకల్పం ఉన్న నేత లేరు. చంద్రబాబు ఉండటం ఏపీ ప్రజల అదృష్టం. తనకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సంపూర్ణంగా ప్రజల భవిష్యత్ ను తీర్చిదిద్దడానికి చంద్రబాబు ఉపయోగించుకున్నారు.
చంద్రబాబు చేసిన కృషికి… ఓ తరం యువత రాత మార్చేందుకు చేసిన ప్రయత్నానికి ఆయనకు ఎంత వరకు రాజకీయ ప్రతిఫలం దక్కిందన్న సంగతిని పక్కన పెడితే.. ఇప్పుడు ప్రతీ చోటా ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. విభజిత ఏపీని ఎలా అభివృద్ధి చేయాలో ఆయన కలలు కన్నారు. వాటిని ఎగ్జిక్యూట్ చేసే దశలో అధికారం కోల్పోయారు. ఐదేళ్ల కిందటితో పోలిస్తే.. ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ఏపీ పరిస్థితి చూస్తే.. ఏం కోల్పోయారో అందరికీ అర్థమవుతుంది.
చంద్రబాబు 14న్నర ఏళ్లు సీఎంగా ఉన్నారు. మిగిలిన కాలం అంతా ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అత్యంత చిన్న వయసులో మంత్రిగా చేశారు. ఆయన చూడని పదవి లేదు.. అనుభవించని అధికారం లేదు. ఇప్పుడు ఆయన సీఎం కావడం ఆయనకు ముఖ్యం కాదు.. ఏపీకి ముఖ్యం.. ఏపీ భవిష్యత్ కు ముఖ్యం.
హ్యాపీ బర్త్ డే.. ఏపీ నీడ్స్ చంద్రబాబు !