వివేకా హత్య కేసులో మాట్లాడుతున్నారని ఎవరూ మాట్లాడవద్దని ఆర్డర్స్ ఇవ్వాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోర్టుకెళ్లారు. కోర్టు అయన కోరినట్లుగా ఎవరూ మాట్లాడవద్దని ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలు… అందులో ఉన్న పదజాలం చూసి న్యాయవర్గాలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. తీర్పుని ఏ చట్టం.. ఏ న్యాయం.. ఏ రాజ్యాంగం ప్రకారం ప్రకారం ఇచ్చారా అని పుస్తకాలు తిరగేస్తున్నారు. కానీ ఎవరికీ ఆన్సర్ దొరకడం లేదు.
ముందుగా పిటిషనర్ వైసీపీ జిల్లా అధ్యక్షుడు. ఆయనకు ఈ కేసుతో సంబంధం లేదు. ఆయనపై ఆరోపణలు చేయడం లేదు. కాబట్టి ఆయనకు పిటిషన్ వేసే అర్హతే లేదు. ఇది ప్రాథమిక అంశంగా న్యాయనిపుణులు చెబుతున్నారు. అలాగే తీర్పులో ఎవరూ ప్రస్తావించవద్దని చెప్పిన అంశాలన్ని సీబీఐ చార్జిషీట్లలో ఉన్నవే. పబ్లిక్ డొమైన్ లో ఉన్నవే. వాటిని ప్రస్తావించకూడదని అనడం.. ప్రజల ప్రాథమిక హక్కు అయిన వాక్ స్వాతంత్రంను నిరాకరించడమే. అదే సమయంలో ఇలా చేసిన ఆరోపణల్ని కూడా మీడియా, సోషల్ మీడియాల్లో తొలగించాలని ఆదేశాలిచ్చారు. అలాగే వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీల కార్యకర్తలను “హెంచ్ మెన్” అంటూ అభ్యంతరపదం కూడా వాడారు తీర్పులో.
ఇప్పుడీ తీర్పు కాపీ సంచలనంగా మారింది. ఈ తీర్పుపై నేడో రేపో హైకోర్టులో పిటిషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. అంత కంటే ముందే ఈ తీర్పు ఇలా ఎందుకు వచ్చిందన్న దానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. హైకోర్టు ఎలా స్పందిస్తుందో కానీ.. ఇలాంటి తీర్పులతో ప్రజల్లో నిగూఢంగా ఉన్న అనుమానాలు… మరింతగా బలపడేలా చేస్తున్నాయని.. న్యాయనిపుణులు ఆందోళన చెందుతున్నారు.