ఎన్డీఏ కూటమి తరపున స్టార్ క్యాంపెయినర్ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 2019తో పాటు తాజా ఎన్నికల్లో ప్రత్యక్షపోటీకి దూరంగా ఉన్నారు. పోటీ చేస్తానంటే ఖచ్చితంగా చంద్రబాబు ఎక్కడో చోట సీటు సర్దుబాటు చేసేవారు.కానీ ఆయన పోటీకి విముఖంగా ఉన్నారు. విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది కానీ.. బొండా ఉమ ను సర్దుబాటు చేయడం కష్టం కావడంతో విరమించుకున్నారు.
పోటీ చేయక పోయినా ప్రచారంలో మాత్రం విస్తృతంగా పాల్గొంటున్నారు. కూటమి నుంచి ప్రచారం చేసే బాధ్యతలను ఈ యువనేతకు చంద్రబాబు అప్పగించినట్లు తెలుస్తోంది. కూటమి గెలుపే లక్ష్యంగా రాధా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. .కాపులు, బలిజలు అధికంగా ఉండే నియోజకవర్గంలో వంగవీటి రాధా పర్యటన సాగేలా కూటమి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. వేసినట్లు సమాచారం. అమరావతి ఉద్యమంలో రైతులకు అండగా నిలిచారు.
స్నేహం పేరుతో కొడాలి నాని, వల్లభనేని వంశీ తరచూ ఆయనను కలిసి ఫోటోలు మీడియాకు లీక్ చేసి.. త్వరలో వైసీపీలోకి వంగవీటి రాధా అని ప్రచారం చేయిస్తూ ఉంటారు. ఇటీవల ఎన్నికలకు ముందు జగన్ దగ్గర నుంచి భారీ ఆఫర్లు తీసుకుని వెళ్లారు కూడా. కానీ అన్నింటినీ సున్నితంగా తోసి పుచ్చి టీడీపీ కూటమికి ప్రచారం చేస్తున్నారు.