‘ఆర్.ఎక్స్.100’తో ఆకట్టుకొన్నాడు కార్తికేయ. అయితే ఆ తరవాతే సరైన హిట్ పడలేదు. ‘బెదురులంక’ కాస్తలో కాస్త ఊరట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేషన్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. ‘భజే వాయువేగం’. ఐశ్వర్య మీనన్ కథానాయికా నటించిన ఈ చిత్రానికి ప్రశాంత్ రెడ్డి చంద్రపు నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. టీజర్ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదలైంది.
యాక్షన్ ప్యాక్డ్ కథ ఇది. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు, ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అధికారి హత్య కేసులో ప్రధాన నిందితుడ్ని పట్టుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ప్రయత్నిస్తుంటుంది. ఆ ఒక్కడే.. హీరో. అసలు ఈ కేసులో హీరో ఎలా ఇరుక్కొన్నాడు, అందులోంచి ఎలా బయటకు వచ్చాడు? అనే ఇతివృత్తం నేపథ్యంలో ఈ కథ సాగుతుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఛేజ్ లు, ఎత్తుకు పై ఎత్తులు, పోలీసుల టాస్క్‌లు… ఇలా టీజర్ పేరుకు తగ్గట్టు వాయి వేగంతో సాగిపోయింది. టీజర్లో కార్తికేయ చెప్పిన డైలాగ్ ని బట్టి, ఇందులో ఫాదర్ సెంటిమెంట్ పుష్కలంగా జోడించినట్టు అర్థం అవుతోంది. తన తండ్రిని కాపాడుకోవడానికి ఓ కొడుకు చేసే పోరాటం ఈ కథగా అనిపిస్తోంది. టీజర్ ప్రామిసింగ్‌గా ఉంది. ప్రేక్షకుల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.