నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్లో తెలిపారు. వదిన భారతి రెడ్డి వద్ద కూడా దాదాపుగా ఇరవై లక్షల అప్పు తీసుకున్నట్లుగా చెప్పారు. ఆస్తులను రూ. 182 కోట్లుగా ప్రకటించారు. గతంలో ఎప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో.. ఆమె ఆస్తులు ప్రకటించలేదు. తొలి సారి ఆస్తుల్ని వెల్లడించారు.
జగన్మోహన్ రెడ్డి కూడా నామినేషన్ వేయబోతున్నారు. ఇప్పుడు తాను షర్మిలకు ఇచ్చిన రూ. 82 కోట్ల అప్పు గురించి కూడా తన అఫిడవిట్లో చెప్పాల్సి ఉంటుంది. లేకపోతే పూర్తి వివరాలు చెప్పనట్లే అవుతుంది. అంత భారీగా అప్పు ఇచ్చినట్లుగా చూపిస్తే.. ఆ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో తన అఫిడవిట్లో షర్మిలకు అప్పు ఇచ్చినట్లుగా ఎప్పుడూ చెప్పలేదు. తన ఇన్ కం ట్యాక్స్ రిటర్న్స్ ఎవరికీ తెలియవు కాబట్టి.. వాటిలో చెప్పారో లేదో తెలియదు.
షర్మిల ఆస్తుల్లో అత్యధికం చరాస్తేలు. రూ.182 కోట్ల ఆస్తుల్లో 123 కోట్లు చరాస్తులే. అంటే కంపెనీలు షేర్లు.. వ్యాపారాలకు చెందిన షేర్లు.. వాహనాలు అనుకోవచ్చు. ఇక స్థిరాస్తులు చాలా తక్కువగా ఉన్నాయి. ఇళ్లు, పొలాలు వంి ఆస్తుల విలువ 45 కోట్లే ఉంటుంది. షర్మిల భర్త అనిల్ కుమార్..షర్మిల కంటే తక్కువ ఆస్తులు. లఆదాయం కలిగి న్నారు. షర్మిలకు ఏటా 97లక్షల ఆదాయం వస్తే.. అది అనిల్ కుమార్ కు కేవలం మూడు లక్షలుగనే ఉంది.
షర్మిలపై మొత్తం ఎనిమిది కేసులు ఉన్నాయి. ఇందులో ఎన్నికల కోడ్ ఉల్లంగన కేసులు కూడా ఉన్నాయి. వైఎస్ జగన్ తో షర్మిల విబేధించి సొంత రాజకీయాలు చేసుకుంటున్నారు. వారి మధ్య ఆస్తుల వివాదం ఉన్నదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.ఈ క్రమంలో జగన్ నుంచి భారీగా అప్పు తీసుకున్నట్లుగా షర్మిల ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.