2014 ఎన్నికలకు ముందు వైసీపీ అభ్యర్థులు చాలా మంది ఒకే రకమైన చీప్ లిక్కర్ ను పెద్ద ఎత్తున డంపులుచేసి పెట్టుకున్నారు. ఎన్నికల సమయంమలో పంచారు. కానీ కొంత మంది దొరికారు. పొన్నూరు నుంచి పోటీ చేసిన రావి వెంకటరమణ. కావలి నుంచి పోటీ చేసిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వంటి వారు దొరికారు. ప్రస్తుత చిత్తూరు అభ్యర్థి విజయానందరెడ్డి కూడా అప్పట్లో దొరికారు. వీరందరిపై ఇప్పటికీ కేసులు ఉన్నాయి. అలా దొరికిన మద్యం పూర్తిగా నకిలీది. ప్రభుత్వానికి పన్నులు చెల్లించినది కాదు. సేమ్ ఇప్పుడు కూడా అదే తరహాలో వైసీపీ నేతల వద్ద మద్యం పట్టుబడుతోంది.
ఇటీవలి కాలంలో వైసీపీ అభ్యర్థులకు చెందిన మద్యం.. పెద్ద ఎత్తున కార్టన్లు కార్టన్లు పట్టుబుతోంది. దాదాపుగా పది నియోజకవర్గాల్లో దొరికింది. అంటే ప్రతి వైసీపీ అభ్యర్థి ముందుగానే మద్యం నిల్వలు ఏర్పాటు చేసుకున్నారన్నమాట. మద్యం పాలసీ వైసీపీ గుప్పిట్లో ఉండటంతో… ఇలా అక్రమంగా రవాణా చేసుకోవడానికి దాచుకోవడానికి ప్రభుత్వ అధికారులే సహకరించారు. ఈ సంగతి పక్కన పెడితే అసలు ఆ మద్యం అంతా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్. అంటే ఏపీలో పన్నులు కట్టిన మద్యం కాదు. అంటే పన్నులు కట్టకుండానే మద్యం దిగుమతి చేసుకున్నారు.
వైసీపీ అభ్యర్థులపై నిఘా పెట్టి… దాడులు చేస్తే… ఎవరూ ఊహించనంత మద్యం బయటపడే అవకాశం ఉంది. రోజాకు చెందిన మద్యం ఒక్క చోటే 250 కార్టన్లు దొరికిందంటే మామూలు విషయం కాదు. మరి ఈసీ దీనిపై దృష్టి పెడుతుందా ?. ప్రభుత్వంలో ఉన్న వాళ్లే… పన్నులు చెల్లించకుండా ఇలా తప్పుడు పద్దతుల్లో మద్యం తెచ్చి నిల్వ చేయడం.. దొరికినాకేసుల విషయంలో పోలీసులు వెనుకాడుతూండటం… వ్యవస్థల దుర్వినియోగానికి సాక్ష్యంగా కనిపిస్తోంది.