ఏ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి కనిపిస్తే.. ఎవరైనా గౌరవం ఇస్తారు. ఎదురుగా నిలబడితే కరచాలనం చేయాలనుకుంటారు. రాజకీయంగా విబేధాలుండొచ్చు. కానీ ఏపీ సీఎం జగన్ ను చూస్తే మాత్రం విద్యార్థులు, యువత పరువు తీసేందుకు వెనుకాడటం లేదు. ఒక్క ఆదిత్యకాలేజీ విద్యార్థులు మాత్రమే కాదు.. ఎక్కడ బస్సు నిలిపినా జనం నుంచి అదే స్పందన వస్తోంది. కాకినాడలో విద్యార్థులతో మాటలు పడి అక్కడ్నుంచి బయలుదేరి వేరే చోటకు వెళ్తే అక్కడ యువత అంత కంటే ఎక్కువగా నినాదాలు చేసింది. ఈ మాటలు విని జగన్ సిగ్గుపడతాడో లేదో కానీ..వైైసీపీ నేతలు మాత్రం జగన్ పై వ్యతిరేకత కాదని.. అంతకు మించి ఉందన్నది సైటైర్లు వేసుకున్నారు.
ప్రభుత్వ డబ్బుల్ని ఓ ఐదు వేలు అకౌంట్లలలో జమ చేసి తాను చేస్తున్నది అదే పెద్ద సాయం అన్నట్లుగా బిల్డప్‌లు ఇచ్చే జగన్ కు..జనం నిజం తెలుసుకున్నారని ఇప్పుడిప్పుడే బోధపడుతోంది. ఆర్టిస్టుల్ని తీసుకొచ్చి చేసే డ్రామాలు మీడియాలో హైలెట్ అవ్వొచ్చు కానీ.. నిజంగా ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఎలా ఉందో.. బస్సు యాత్రలో జగన్ చూసి ఉంటారు. కానీ ఆయన తన ట్రెడ్ మార్క్ నిర్వికారమైన నవ్వులో విషం నింపుకుని.. వ్యతిరేక నినాదాలు చేసిన వారిపై కక్ష సాధించుకుంటూ వస్తున్నారు.
జగన్‌ను అభిమానించే వారు తగ్గిపోయారు. కానీ ద్వేషించే వారు మాత్రం భారీగా పెరిగారు. మామూలుగా రాజకీయ నాయకుడిపై వ్యతిరేకత ఉండవచ్చేమో కానీ.. అది ద్వేషం స్థాయికి పెంచుకోవడంలో జగన్ మోహన్ రెడ్డి తన రాజకీయం చేశారు. ఇప్పుడు అది బయటపడుతుంది. డబ్బు తో ఏమైనా చేయవచ్నన్నట్లుగా జగన్ రెడ్డి ఉన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆయనకు తత్వం బోదపడే చాన్స్ ఉంది. కానీ అప్పుడు ఆయన చేయడానికి ఏమీ ఉండదు..