జనసేన ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసును ఆ పార్టీ పోటీ చేయని చోట స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించనున్నారు. ఇండిపెండెంట్లు తమకు ఏ గుర్తు కావాలో కోరుకునేచాన్స్ ఉంది. వారికి అందుబాటులో ఉన్న గుర్తుల్లో గ్లాస్ ఉంది. జనసేనకు గాజు గ్లాసును ఎన్నికల గుర్తుగా ఇవ్వడాన్ని హైకోర్టు అనుమతించింది. ఈ తీర్పు ప్రకారం ఆ పార్టీ పోటీ చేస్తున్న చోట మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులకు ఈ గుర్తు కేటాయిస్తారు. ఆ పార్టీ అభ్యర్థులు లేనిచోట స్వతంత్ర అభ్యర్థులు ఎవరైనా కోరుకుంటే వారికి ఈ గుర్తు ఇస్తారు.
ఇండిపెండెంట్లు కోరుకోవడానికి వీలుగా కొన్ని గుర్తులను ఫ్రీ సింబల్స్ పేరిట ఎన్నికల కమిషన్ ముందే ప్రకటించింది. అందులో గాజు గ్లాసు గుర్తు ఉంది. జనసేన 21 అసెంబ్లీ, రెండు ఎంపీ సీట్లకు పోటీ చేస్తోంది. తిరుపతి ఉపఎన్నికల సమయంలో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేశాయి. బీజేపీ అభ్యర్థి బరిలో ఉన్నా.. గాజు గ్లాస్ గుర్తు కూడా వేరే అభ్యర్థికి కేటాయించారు. ఆ అభ్యర్థికి రెండున్నర వేల ఓట్లు వచ్చాయి.
గాజు గ్లాస్ గుర్తును కూడా కూటమి అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ అవకాశాన్ని వైసీపీ అసలు వదులు కోదు. తమ తరపున అభ్యర్థున్ని నిలబెట్టి విస్తృతంగా ప్రచారం చేసినా ఆశ్చర్యపోవాల్సిన పన ిఉండదు. ఈ సమస్యను ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి జనసేన నాయకులు తీసుకెళ్లారు. ఈసీ తీసుకునే నిరణయం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.