రఘురామకృష్ణరాజుకు తెలుగుదేశం పార్టీ ఉండి నియోజకవర్గ బీఫాం ఇచ్చింది., అభ్యర్థిగా ఇంత కాలం ప్రచారం చేసుకున్న మంతెన రామరాజును బుజ్జగించారు. ఆయనను నర్సాపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షురాలిగా నియమించారు. ఆ స్థానంలో తోట సీతారామలక్ష్మిని మొత్తం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సమన్వయకర్తగా నియమించారు. ఈ మార్పులతో అంతా సెట్ అయినట్లే భావిస్తున్నారు.
అభ్యర్థులందరికీ చంద్రబాబు బీఫాంలు ఇచ్చారు. మొత్తం ఐదు చోట్ల అభ్యర్థులను మార్చారు. ఉండితో పాటు అనంతపురం మడకశిర నుంచి పార్టీ ఎస్సీసెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజుకు చాన్సిచ్చారు. ఇంతకు ముందు ప్రకటించిన సునీల్ కుమార్ నిర్లక్ష్యంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే మాడుగల నుంచి పైల ప్రసాద్ ను మార్చి బండారు సత్యనారాయణూర్తికి అవకాశం ఇచ్చారు. ఈ మార్పుల్లో సీఎం రమేష్ ఒత్తిడి కీలకంగా పని చేసినట్లుగా భావిస్తున్నారు.
పాడేరులో ఇంతకు ముందు గిడ్డి ఈశ్వరిని కాదని మరొకర్ని ప్రకటించారు. ఆమె రెబల్ గా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే చంద్రబాబు చివరికి ఆమెకే సీటివ్వాలని డిసైడ్ అయ్యారు. ఇక వెంకటగరిలో కురుగొండ్ల రామకృష్ణ కుమార్తెకు సీటు ఇచ్చారు. ఇప్పుడు ఆయనకే టిక్కెట్ ఖరారు చేశారు.