షర్మిలారెడ్డి ఎన్నికల్లో పోటీ చేస్తూ నామినేషన్ దాఖలు చేశారు. తన అఫిడవిట్ లో సోదరుడు జగన్ రెడ్డి దగ్గర రూ. 82 కోట్లకుపైగా అప్పు తీసుకున్నట్లుగా చూపించారు. ఇంత అప్పుఏమిటా అనుకున్నారు.. ఇందులో లోగుట్టును షర్మిల మీడియాలో సమావేశంలో వెల్లడించారు. తనకు రావాల్సిన ఆస్తిలో వాటాలో కొసరు ఇచ్చి.. దాన్ని అప్పు ఖాతాలో జగన్ రాశారట. కర్నూలులో ఎన్నికల ప్రచారంలో ఉన్న షర్మిల ఈ విషయాలను స్వయంగా వెల్లడించారు.
కుటుంబ ఆస్తిలో నిజానికి చెల్లెలికి ఏ ఆన్న అయినా వాట ఇవ్వాలని.. అది ఆడబిడ్డ హక్కు అన్నారు. ఆడబిడ్డ కు ఇవ్వాల్సిన బాధ్యత అన్నకు ఉంన్నారు. మేనమామగా కూడా భాధ్యత ఉందన్నారు. తల్లి తర్వాత తల్లి స్థానంలో నిలబడేది మేనమామ కాబట్టి ఆ బాధ్యత ఉంటుదన్నారు. ఇది సహజంగా అందరు పాటించే నియమమని.. కొందరు చెల్లెళ్ళకు ఇవ్వాల్సిన అస్థి వాటాను తమ వాటాగా భావిస్తారని జగన్ గురంచి వ్యాఖ్యానించారు.
తామేదో చెల్లెళ్ళకు గిఫ్ట్ గా ఇస్తున్నామని బిల్డప్ ఇస్తారని.. ఇలాంటి వాళ్ళు సమాజంలో ఎక్కువ మంది ఉన్నారని విమర్శించారు. ఒక్క కొసరు చెల్లెళ్ళకు ఇచ్చి అదికూడా అప్పు ఇచ్చినట్లు చూపిస్తారన్నారు. ఇది వాస్తవం… కుటుంబం మొత్తం తెలుసు… దేవుడికి కూడా తెలుసన్నారు. అయితే తమ పోరాటం ఆస్తుల కోసం కాదని.. ఎవరు ఏమన్నా…మేము నిలబడ్డది ఇది ఆస్తుల కోసం కాదు..పదవుల కోసం కాదు న్యాయం కోసమన్నారు.
సునీత కుమిలి పోతోందని.. వివేకా ను గొడ్డలితో దారుణంగా నరికి చంపారన్నారు. హత్యను మభ్య పెట్టాలి అని చూస్తున్నారని.. విమరశించరాు. రేపు మాకైనా, మా పిల్లలకు అయినా ఏమవుతుందో తెలియదన ిఆందోళన వయ్క్తం చేశారు. మొండిగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నామన్నారు.