లోక్ సభ ఎన్నికల ప్రచారంపై కేసీఆర్ అంత ఆసక్తిగా లేనట్లుగా కనిపిస్తోంది. ప్రతీ ఎన్నికలకు ముందు భారీ బహిరంగసభ పెట్టి నగారా మోగించే ఆయన ఈ పార్లమెంట్ ఎన్నికలకు బస్సు యాత్ర చేయాలనుకున్నారు. దాన్ని కూడా వీలైనంత ఆలస్యం చేస్తున్నారు. సోమవారం నుంచి యాత్ర ప్రారంభించాలనుకున్నారు కానీ.. రెండు రోజుల వాయిదా తర్వాత ప్రారంభిస్తున్నట్లుగా తెలిపారు. 24 నుంచి యాత్ర ప్రారంభం కానుందని మే 10 వరకు కొనసాగుతుందని బీఆర్ఎస్ నేతలు చెప్పారు.
మే 11వ తేదీ సాయంత్రానికి ప్రచార గడువు ముగుస్తుది. పొలంబాట, రోడ్ షోలు, కార్నర్ మీటింగులు కేసీఆర్ నిర్వహించాలనుకుటున్నారు. ముగింపు సభను సిద్దిపేటలో నిర్వహిస్తారు. పార్టీ పెట్టిన తర్వాత ఎప్పుడూ ఎదుర్కోనంత క్లిష్టమైన పరిస్థితిని కేసీఆర్ ఎదుర్కొంటున్నారు. రెండు జాతీయ పార్టీల మధ్యనే పోరు జరుగుతోదంన్న అభిప్రాయంతో బీఆర్ఎస్ మరింతగా నలిగిపోతోంది. రాష్ట్ర ఎన్నికల్లోనే పట్టించుకోని ఓటర్లు.. పార్లమెంట్ ఎన్నికల్లో పట్టించుకుంటారా అన్న ఆందోళన కనిపిస్తోంది.
కేసీఆర్ తుంటి గాయంతో గట్టిగా నిలబడలేని.. నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. అయినా ఆయనకు తప్పడం లేదు. కేటీఆర్ ప్రచారభారాన్ని మోసేంత నేతగా మారలేదు. హరీష్ రావు మెదక్ కు పరిమితం అయ్యారు. మొత్తంగా కేసీఆర్ కు ప్రచారం ప్రారంభించి పూర్తి చేయడం ఓ సవాలే అనుకోవచ్చు.