ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షా ఫలితాలను విద్యాశాఖ కమిషనర్ సురేష్ విడుదల చేశారు. తాజాగా వెల్లడైన పదో తరగతి ఫలితాల్లో 86.69మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది కూడా టెన్త్ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు.
మొత్తంగా 5.34లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు. 89.17శాతం మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారు. 17 పాఠశాలలో సున్నా ఉత్తీర్ణత నమోదు అయింది. ఈ ఏడాది 6,23,092 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో1,02,528మంది గతంలో పదో తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా ఉన్నారు.
ఎన్నికల దృష్ట్యా ఈసారి పదో తరగతి పరీక్షలను ముందుగానే నిర్వహించింది ప్రభుత్వం. ఏపీ వ్యాప్తంగా 3,473కేంద్రాల్లో మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. ఈ సారి పరీక్షలు జరిగిన నెల రోజుల లోపే పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు.