వైసీపీ హయాంలో ఆలయాల్లోనూ విధ్వంసాలు జరిగాయి. ప్రత్యక్షంగా దోపిడీకి పాల్పడిన ఘటనలూ లెక్కలేనన్నిజరిగాయి. విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో వెండి సింహాల చోరీ పెద్ద సంచలనంగా ఉంది. ఏదో పాత నేరస్తుడ్ని చూపించి కేసును క్లోజ్ చేశారు కానీ చాలా అనుమానాలు ఇంకా మిగిలే ఉన్నాయి. ఇయితే ఇప్పుడు బెజవాడలోనే కాదు.. శ్రీకాళహస్తి ఆలయంలోనూ ఇలాంటి వెండి చోరీ జరిగిందని తేలింది.
తానే స్వయంగా ఆలయలో దేవునికి చెందిన వెండిపాత్రలను దొంగతనం చేశానని.. తనతో ఆ పని ఎమ్మెల్యే చేయించాడని.. ఎమ్మెల్యే బియ్యం మధుసూదన్ రడె్డి ప్రధాన అనుచరుడు హేమచంద్రారెడ్డి ఆలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యేతో తనకు ప్రాణహాని ఉందని.. తాను చేసిన తప్పుకు శిక్షగా ఆలయం ఎదుట శివయ్యను క్షమాపణ కోరుతున్నానన్నారు. తాను చెప్పింది నిజమని.. విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. తాను అన్ని వివరలు ఇస్తానంటున్నారు. దొంగతనం చేసిన ఆలయవెండిని ఆయన ఎమ్మెల్యేకే ఇచ్చాడు.
కాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వ్యవహారం అత్యంత వివాదాస్పదంగా మారుతోంది. ఆయన పై సొంత కుటుంబసభ్యులు కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఆలయంలో ఆయన చేసిన నిర్వాకాలు హైలెట్ అవుతున్నాయి. ఈ క్రమంలో హేమచంద్రారెడ్డి ఆరోపణలు సంచలనంగా మారుతున్నాయి. ఇప్పటి ప్రభుత్వం విచారణ జరపదు.. కానీ తర్వాత ప్రభుత్వం మాత్రం వదిలి పెట్టదు.