దేశంలో చాలా మంది పారిశ్రామికవేత్తలు ఎన్నికల బరిలోకి దిగి ఉంటారు కానీ.. వారెవరూ తమ ఆస్తుల్ని వేల కోట్లలో చూపించలేదు. చాలా తక్కువే చూపిస్తారు. కానీ అమెరికాలో మెడికల్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉన్న గుంటూరు టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాత్రం .. తన ఆస్తుల్ని నిర్భయంగా ప్రకటించారు. తన కు.. తన కుటుంబానికి మొత్తంగా రూ. 5598 కోట్ల ఆస్తులు ఉన్నాయని ప్రకటించారు. ఇందులో స్థిరాస్తులు.. చరాస్తులతో పాటు కుటుంబసభ్యులవి కూడా కలసి ఉన్నాయి. అదే సమయంలో అప్పులు కూడా వెయ్యి కోట్ల రూపాయల వరకూ ఉన్నట్లుగా ప్రకటించారు.
పెమ్మసాని చంద్రశేఖర్ ఎంబీబీఎస్ ఇక్కడే చదివినా.. పై చదువులకు అమెరికా వెళ్లారు. అక్కడే మెడికల్ ఫీల్డ్ లో స్థిరపడ్డారు. యూవరల్డ్ పేరుతో అమెరికాలో మెడికల్ ఎంట్రన్స్ కు ప్రిపేరయ్యే విద్యార్థుల కోసం ఆన్ లైన్ ఎడ్యూటెక్ కంపెనీని నడుపుతున్నారు. ఇతర వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఆయన జన్మభూమికి సేవ చేయాలన్న ఉద్దేశంతో ఏపీకి తిరిగి వచ్చి.. టీడీపీ తరపున పార్లమెంట్ కు పోటీ చేస్తున్నారు.
చాలా కాలం అమెరికాలో ఉన్నా.. పెమ్మసాని చంద్రశేఖర్ .. తెలుగును కానీ.. ఇక్కడి పరిస్థితుల్ని కానీ ఎప్పుడూ మిస్ కాలేదు. పూర్తి స్థాయి అవగాహనతో ఆయన చేస్తున్న రాజకీయం అందర్నీ ఆకట్టుకుంది. వచ్చిన రెండు వారాల్లోనే గల్లా జయదేవ్ ను మించిన రాజకీయ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు.