రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ సినిమాకి టైటిల్ ఫిక్స్ అయ్యింది. ఈ సినిమా కూలీ అనే పేరుని ఖరారు చేశారు. దాదాపు మూడు నిమిషాల నిడివిగల టైటిల్ టీజర్ ని కూడా వదిలారు. లోకేష్ కనకరాజ్ సినిమాలు అంటే డ్రగ్స్, చీకటి రాజ్యం. ఇందులో చీకటి రాజ్యం వుంది కానీ డ్రగ్స్ కి బదులు బంగారం చుట్టూ కథని నడుపుతారని టీజర్ చూస్తే అర్ధమౌతుంది. కేజీఎఫ్ లా టీజర్ అంతా బంగారం, బిస్కెట్లు వాచీలతో నిండిపోయింది. కేజీఎఫ్ బంగారు గనుల్లో జరిగితే ఇది మాత్రం బంగారం స్మగ్లింగ్ చుట్టూ తిరుగుతుందనిపిస్తోంది. టీజర్ లో రజనీ వింటేజ్ శ్వాగ్ కనిపించింది. అనిరుద్ నేపధ్య సంగీతం కూడా బాగా కుదిరింది. జైలర్ తో మళ్ళీ ఫాం లోకి వచ్చారు రజనీ. లోకేష్ ఖైదీ, విక్రమ్ లియోతో తనకంటూ ఒక సినిమాటిక్ యూనీవర్స్ క్రియేట్ చేశాడు. వీరిద్దరి కలయిలో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు వున్నాయి.