సస్పెన్షన్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేసును వీలైనంతగా లేటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విచారణకు హాజరు కావాల్సిన అడ్వాకేట్ జనరల్ డుమ్మా కొట్టారు. అదే కారణం చూపి.. ఆయన రానందున విచారణ వాయిదా వేయాలని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్ ముందు వాదించారు. క్యాట్ ఈ మేరకు కేసు విచారణను 29కి వాయిదా వేసింది.
ఏబీవీపై చట్ట విరుద్ధమైన సస్పెన్షన్ విధించారని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. సుప్రీంకోర్టు చెప్పినా కూడా మళ్లీ స్సస్పెన్షన్ వేటు వేశారు. ఆయన కెరీర్ లో ఐదేళ్ల పాటు ఇలా వృధా అయింది. ఇప్పుడు క్యాట్ ముందు కూడా విచారణకు హాజరు కాకుండా తప్పించుకుంటున్నారు. గత విచారణలో ఏబీ వెంకటేశ్వరరావు తప్పు చేశారనడానికి ఆధారాలు చూపించాలని క్యాట్ అడిగితే.. నీళ్లు నమిలారు. ఈ విచారణకు అసలే డుమ్మా కొట్టారు.
ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేస్తే ప్రస్తుతం ఉన్న ఆఫీసర్లలో ఆయనే సీనియర్ అవుతారు. డీజీపీని బదిలీ చేస్తే ఆయనే డీజీపీ అవుతున్నారు. అలా కాకుండా ఉండేందుకు ఆయనపై విచారణ జరగకుండా వాయిదా వేసేలా చూస్తున్నట్లుగా తెలుస్తోంది. మరో వైపు ఆయన రిటైర్మెంట్ తేదీ కూడా దగ్గర పడింది. మే 30వ తేదీన ఆయన రిటైర్ అవుతారు. అయితే అక్రమ సస్పెన్షన్ వల్ల ఐదేళ్లు నష్టపోయినందున పొడిగిపు ఇస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.