పిఠాపురం చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీ ర్యాలీ జరిగింది. పవన్ తాను అద్దెకు తీసుకున్న చేబ్రోలులోని ఇంటి నుంచి నామినేషన్ వేసేందుకు ఆర్వో ఆఫీసుకు వచ్చేందుకు ఐదు గంటలకుపైగా సమయం పట్టింది. ఇంకా ఆలస్యమయ్యే ప్రమాదం ఉండటంతో మధ్యలోనే దిగి.. వేరే దారిలో రిటర్నింగ్ ఆఫీస్ కు చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు.
పవన్ కల్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు వికటిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆయనపై వ్యక్తిగత దాడినే అస్త్రంగా చేసుకుని వైసీపీ ఎగబడుతోంది. అయితే పన్ కల్యాణ్ మత్రం.. ఆవేశంగా కౌంటర్ ఇస్తున్నారు..కానీ ఎక్కడా గీత దాటడం లేదు. పవన్ పై జరుగుతున్న దాడి ఎఫెక్ట్ పిఠాపురం వాసుల స్పందనలో స్పష్టంగా తెలిసిపోయింది. ఆయనపై పోసాని సహా అనేక మందిని దింపి తిట్టిస్తున్నారు. ఇది రాను రాను నెగెటివ్ గా మారుతోంది.
టీడీపీ ఇంచార్జ్ వర్మ పూర్తి స్థాయిలో పవన్ కల్యాణ్ గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. ఆయన గ్రౌండ్ లెవల్ లో మొత్తం చూసుకుంటున్నారు. ఈ క్రమంలో పిఠాపురం ర్యాలీ ఊహించనంత భారీగా జరిగింది. ఈ స్పందన చూసి వైసీపీ నేతలకు కూడా మైండ్ బ్లాంక్ అయి ఉంటుంది. ఎంత ఖర్చు పెట్టి ఆర్టీసీ బస్సుల్ని పెట్టి తోలుకొచ్చినా ఇంత జనం రారని వారికి క్లారిటీకి వచ్చారు. అయితే అవన్నీ ఓట్లుగా మారుతాయా లేదా అన్న సెటైర్లు వారు వేయవచ్చు. కానీ ఈ సారి కూటమి అనే సంగతిని మర్చిపోతున్నారు.