కాంగ్రెస్ పార్టీ అత్యంత సులువుగా గెలిచే సీటు ఖమ్మం అనుకున్నారు. మిత్రపక్షంతో కలిసి ఆ లోక్ సభ పరిధిలో ఉన్న అన్ని చోట్లా గెలిచారు. అదీ కూడా భారీ మెజార్టీలతో. ఇప్పుడు లోక్ సభకు వచ్చే సరికి.. ముఖ్య నేతల్ని సర్దుబాటు చేయలేక .. సామాజికవర్గాల్ని సంతృప్తి పర్చలేక బీఆర్ఎస్ కు అడ్వాంటే్క కలిపిస్తున్నారు.
కాంగ్రెస్ గత ఎన్నికల్లో గెలవడానికి పలు సామాజికవర్గాలు కలసి పని చేశాయి. ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరడంతో.. ఆయన వర్గం కూడా సహకరించింది. సంప్రదాయంగా ఖమ్మం ఎంపీ సీటు కేటాయించే సామాజికవర్గానికి ఈ సారి సీటు కేటాయించడం లేదు. పోనీ ఇతర చోట్ల అయినా అవకాశం కల్పిస్తున్నారా అంటే అదీ లేదు. ఆ ఒక్క సామాజికవర్గానికే కాదు.. అసలు ఒక్క రెడ్డి వర్గం తప్ప మరో వర్గానికి ప్రాధాన్యం ఇవ్వకుండా రాజకీయం చేస్తున్నారు.
నామా నాగేశ్వరరావుకు గుడ్డు కాలం అనుకున్నారు. ఆయన డబ్బులు ఖర్చు పెట్టేందుకు కూడా సిద్ధంగా లేరు. సాదాసీదగా ప్రచారం చేస్తున్నారు. కీలక నేతలు దూరం అయ్యారు. అయినప్పటికీ కాంగ్రెస్ చేస్తున్న రాజకీయంతో ఆయనలో ఆశలు చిగురిస్తున్నాయి. రెండు రోజుల్లో ఖమ్మంలో కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ సంఫూర్ణం అవుతుందని అప్పట్నుంచి నామా నాగేశ్వరరావు అసలు రాజకీయం కనిపిస్తుందని బీఆర్ఎస్ నేతలంటున్నారు.