పదేళ్ల తర్వాత కేసీఆర్ టీవీ డిబేట్లో పాల్గొంటున్నారని బీఆర్ఎస్ నేతలు హడావుడి చేశారు. ఎన్నికల ప్రచారం కోసం ఊళ్లల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రచార వాహనాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని హంగామా చేశారు. కేసీఆర్ ఏదో ఘన కార్యం చేయబోతున్నట్లుగా హైప్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేశారు. చివరికి ఆ డిబేట్ చూసిన వారికి.. తాను చెప్పేదేదో ప్రెస్మీట్లో చెబితే అన్ని టీవీలుచూపించేవి కదా అన్న డౌట్ వస్తుంది.
కేసీఆర్ కు ఇది డిబేట్ కాదు. కేవలం వన్ సైడ్ తాను ఏం చెప్పాలనుకున్నారో వచ్చి చెప్పారు. ఎదురుగా ఉన్న రజనీకాంత్ కు నోరు పెగల్లేదు. ఎప్పుడైనా ఆయన నోరు తెరుద్దామనుకుంటే… డిస్ట్రబ్ చేయవద్దని కేసీఆర్ గదమాయించారు. కేసీఆర్ ఎం చెప్పదల్చుకున్నారో దానికి కంటిన్యూటీ ఉండేలా ప్రశ్నలు అడగడానికి మాత్రం సరిపోయారు. ఎక్కడా ఆయన కేసీఆర్ ను ఇబ్బంది పెట్టాలనుకోలేదు. అంత అవకాశం కేసీఆర్ ఇవ్వలేదు.
కేసీఆర్ డిబేట్ అనుకుని చూసిన వారంతా అది ప్రసంగమని అర్థమయ్యే సరికి .. డ్రాప్ అయిపోయారు. కొత్తగా చెప్పిందేమీ లేదు. చివరికి ఇదేతో తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెడితే..అన్ని టీవీ చానళ్లలో వచ్చేది కదా.. మరింత ఎక్కువ మందికి చేరేది కదా అన్న డౌట్ చాలా మందికి వచ్చింది. బీఆర్ఎస్ నేతలకూ వచ్చింది. ఇప్పుడు ఈ ఇంటర్యూ ఎక్కువ మంది చేరలేదని తేలిన తర్వాత బీఆర్ఎస్ పెద్దలకూ అదే అనిపించి ఉండవచ్చు.