జగన్మోహన్ రెడ్డి తాను చెప్పుకునే బైబిల్, ఖురాన్, భగవద్గీతలో అయిన మేనిఫెస్టోలో మరో ప్రధాన హామీ పట్టణ గృహనిర్మాణం. మూడు వందల అడుగుల ఇళ్లు ఇచ్చి అడుగుకు రూ.రెండు వేలకు అమ్మారని గత ప్రభుత్వంపై నిందలేశారు. ఇరవై ఏళ్ల పాటు నెలకు మూడు వేల చొప్పున కట్టాల్సి ఉంటుందని ఈ అప్పుభారాన్ని రద్దు చేసి ప్రభుత్వం పూర్తిగా భరిస్తుందని హామీ ఇచ్చారు. మరి వాస్తవంలో ఏం జరిగిందంటే.. ఆ ప్రజల ఇళ్లను కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుని.. నోటీసులు మాత్రం నిరుపేదలకు పంపుతున్నారు. ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాన్ని ఏమనాలి ?
Also Read : మేనిఫెస్టో మోసాలు : ఎస్సీ, ఎస్టీలకు చెప్పింది ఒక్కటి కూడా చేయలేదేందయ్యా !
ఇళ్ల రుణాలన్నీ మాఫీ చేస్తానని ఊరూవాడా ఉదరగొట్టిన జగన్
ఎన్నికల ప్రచార సమయంలో ఊరూవాడా జగన్ ఇచ్చినప్రధాన హామీల్లో ఒకటి హౌసింగ్ లోన్ల రద్దు. ప్రభుత్వం నుంచి తీసుకున్న హౌసింగ్ రుణాలు మొత్తాన్ని రద్దు చేస్తానని ప్రకటించారు. రూపాయికే అందరికీ ఇళ్లు ఇస్తానన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక అసలు పట్టణ పేదల్ని జగన్ ఘోరంగా మోసం చేశారు. ఒక్కరంటే ఒక్కరికి రుణమాఫీ చేయలేదు. తాను మూడు వందల అడుగుల ఇళ్లకే రుణమాఆఫీ చేస్తానన్నానని అంతకు మించిన ఇళ్లకు అంటే 325 అడుగుల ఇళ్లకు రుణమాఫీ చేస్తానని చెప్పలేదని సలహాదార్లలో చెప్పించారు. నిజానికి ఏప్రభుత్వం 300 అడుగుల ఇళ్లు కట్టించలేదు. అక్కడే జగన్ రెడ్డి అసలు మోసం బయటపడింది.
పాడబడిపోతున్న టిడ్కో ఇళ్లు
ప్రభుత్వం నిర్మించిన టిడ్కో ఇళ్లను పంచలేదు. పాడు పెట్టేశారు. లక్షల ఇళ్లు అన్ని చోట్లా అలా శిధిలంగా కనిపిస్తున్నాయి. కనీస సౌకర్యాలు కల్పించి లబ్దిదారులకు కేటాయిచాల్సిన ఇళ్లను .. టీడీపీ ప్రభుత్వానికి పేరు వస్తుందనో లేకపోతే.. అవి టీడీపీ హయాంలో ఎంపిక చేసిన లబ్దిదారులకు ఇవ్వాల్సి వస్తుందనో పూర్తిగా పక్కన పెట్టేశారు. ఈ కారణంగా లక్షల మంది టిడ్కో ఇళ్లలబ్దిదారులు మోసపోయారు. వారు ఆ ఇళ్ల కోసం కొంత డబ్బు కట్టారు. ఇటు ఇళ్లూ ఇవ్వలేదు.. అటు డబ్బులూ ఇవ్వలేదు. మొత్తానికే మోసపోయారు. రుణమాఫీ అవుతుదంనుకుంటే… ఏదీ లేకుండా పోయింది.
Also Read: మేనిఫెస్టో మోసాలు : రైతు భరోసా రూ. 7500 ఎందుకయింది ?
అసలు మోసం టిడ్కో ఇళ్లను తాకట్టు పెట్టి నోటీసుల్ని లబ్దిదారులకు పంపండం
టీడీపీ హయాంలో లక్షల ఇళ్లు నిర్మించారు. లబ్దిదార్లకు కేటాయించారు. మౌలిక సదుపాయాలు కల్పించి ఎవరివి వారికి ఇవ్వాల్సిన ప్రభుత్వం ఆపేసింది. కానీ ఆ లబ్దిదార్ల పేర్లపైనే ప్రభుత్వం అప్పులు చేసింది. ఇలా మొత్తం టిడ్కో ఇళ్లను తాకట్టు పెట్టేసి పది వేల కోట్లను తీసుకుంది. కానీ ఇళ్లు పూర్తి కాలేదు. ఆయా లబ్దిదారుల చేతికి రాలేదు. కానీ బ్యాంకులు మాత్రం… ఆ ఇల్లు వేలం వేస్తామని లబ్దిదారులకు నోటీసులు పంపుతున్నాయి. ఈ నోటీసులు అందుకుంటున్న లబ్దిదారులు అవాక్కవుతున్నారు. ఇంత అడ్డగోలుగా తమను తాకట్టు పెట్టేశారా అని మథనపడుతున్నారు.
జగన్ మోహన్ రెడ్డిని నమ్మిన పట్టణ పేదలు..ఈ సారి ఫ్యాన్ పవర్ పీకేయడానికి.. బటన్ నొక్కేందుకు రెడీగా ఉన్నారు.