జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .. పెయిడ్ ఆర్టిస్టులకు వస్తున్న ఆఫర్. అలా ఆఫర్ చేసే మొత్తం చిన్నది కాదు . లక్షల్లోనే ఉంటోంది. దీంతో మనం చెబితే మాత్రం నిజం అవుతుందా.. చెబితే డబ్బులొస్తాయని చాలా మంది జగన్ గ్రాఫ్ పెరుగుతోందని కబుర్లు చెబుతూ ఆన్ లైన్ లోకి వస్తున్నారు. నిజానికి జగన్ గ్రాఫ్ పెరుగుతోందంటే… ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం అని జనాల్లోకి వెళ్తోందని.. తామే తీసుకెళ్తున్నామన్న లాజిక్ ను మిస్ అవుతున్నారు.
జగన్మోహన్ రెడ్డి ప్రజాదరణ కోల్పోయారని ఎప్పుడో తేలింది. ఆయన ఐదున్నర కోట్లు ప్రజాధనం.. పిల్లలు పరీక్ష ఫీజులుగా కట్టిన మొత్తం ఇండియా టుడేకు కట్టి ఓ కాంక్లేవ్ పెట్టినా… ఆ సంస్థ.. జగన్మోహన్ రెడ్డి పాపులారిటీ ఏపీ ప్రజల్లో పదిహేను శాతం కన్నా తక్కువకు పడిపోయిందని తేల్చారు. ఇది ఊరికనే పడిపోలేదు. ఆయన తుగ్లక్ నిర్ణయాలు వల్ల పడిపోయింది. చేతకాని పరిపాలన వల్ల పడిపోయింది. అధికారం అంటే దోచుకోవడానికి… కక్షలు తీర్చుకోవడానికి అన్నట్లుగా సాగిన పరిపాలన వల్ల పడిపోయింది. మరి ఇప్పుడు ఎందుకు పెరుగుతుంది ?
జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరగాలంటే.. ఏదో ఓ అద్భుతం చేసి ఉండాలి.. కానీ ఆయన చేసిందేమీలేదు. నమ్ముకున్న వాళ్లందర్నీ నట్టేట ముంచడంతో వారంతా వదిలి వెళ్లిపోయారు. ఇతర పార్టీలన్నింటినీ ఏకం చేయడంలో తన తెలివి తేటల్ని ప్రదర్శించారు. పవన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి.. ఓ వర్గాన్ని తనపై కసితో పని చేసేలా చేసుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన రోజు రోజుకు పాతాళంలోకి దిగిపోతున్నారు కానీ కోలుకోవడం లేదు. డబ్బులిచ్చి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేసుకుంటే… పెరుగుతుందా ?. డబ్బు ఖర్చు తప్ప !