ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్ వేయించుకొని ఆయన బస్సుయాత్రను కొనసాగిస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ, ఇంకా జగన్ కు గాయం మానలేదా..? అని ప్రజల్లో చర్చ మొదలైంది.
జగన్ కు అదృష్టావశాత్తు స్వల్ప గాయమైందని వైసీపీ శ్రేణులు చెప్పుకొచ్చాయి. రెండు వారాలు సమీపిస్తున్నా స్వల్ప గాయం నయం కాలేదా..? ఇంకా బ్యాండేజ్ తోనే జగన్ బస్సుయాత్ర కొనసాగిస్తుండటం ఏంటని ఆరా తీస్తున్నారు. గాయం తీవ్రత తగ్గకపోవడంతోనే బ్యాండేజ్ తీయలేదా..? లేదంటే సానుభూతి కోసమే బ్యాండేజ్ డ్రామా కొనసాగుతుందా..? అని జగన్ బస్సుయాత్ర కొనసాగుతోన్న ఏరియాలో చర్చ జరుగుతోంది.
ఇంకెన్ని రోజులు బ్యాండేజ్ ను ఉంచుకుంటారని..ఎన్నికల సమయం ముగిసేవరకు ఆ కట్టు తీయరా..?అనే ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి.గతంలో కోడికత్తి డ్రామాతో సానుభూతి పొందిన జగన్.. ఇప్పుడు గులకరాయి ఇష్యూతో సానుభూతి పొందేందుకు ఆ కట్టు తీయడం లేదంటూ ప్రచారం జరుగుతోంది.
వైసీపీ బలం మేనిఫెస్టో…అభివృద్దో కాదని.. జగన్ బ్యాండేజ్ అంటూ ఎద్దేవా చేస్తున్నారు నెటిజన్లు.