ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచింది. విజయ్ దేవరకొండ, పరసురాం సక్సెస్ కాంబినేషన్ లో మంచి అంచనాలతో వచ్చిన సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. గీతగోవిందం మ్యాజిక్ మరోసారి వర్క్ అవుట్ అవుతుందని భావించారంతా. కానీ నిర్మాత దిల్ రాజుకు ఫ్యామిలీ స్టార్ షాక్ ఇచ్చింది. ఈ సినిమా నష్టాలు గట్టిగానే వున్నాయి. జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి హీరో విజయ్ కొంత పారితోషకాన్ని వెనక్కి ఇచ్చారని తెలుస్తోంది. మరి దర్శకుడు పరశురాం నష్ట నివారణ చర్యలకు పూనుకుంటారా ? లేదా ? అనే ప్రశ్న వినిపిస్తుంది. ఈ సినిమా కోసం దాదపు 12 కోట్లు రెమ్యునిరేషన్ గా తీసుకున్నారట పరశురాం. విడుదలకు ముందు రెండు కోట్లు బ్యాలెన్స్ వుంటే ఎట్టిపరిస్థితిలో క్లియర్ చేయాల్సిందేనని పట్టుబట్టి మరీ తీసుకున్నారట. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే ఆయన భాగంలో కొంత డబ్బులు వెనక్కి ఇచ్చే కండీషన్ కనిపించడం లేదు. అయితే దిల్ రాజు బ్యానర్ లోనే ఆయన మరో సినిమా చేయాల్సివుంది. ఆ సినిమాకి రెమ్యునిరేషన్ లో సర్దుబాట్లు చేసే అవకాశం వుంది.