రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిన నేత గుడివాడ అమర్నాథ్. ఓ సందర్భంలో పవన్ తో ఫోటో దిగి..తనతోనే పవన్ ఫోటో దిగాడని పెద్ద పెద్ద మాటలు చెప్పిన వ్యక్తి. ఇప్పుడు తన నామినేషన్ ర్యాలీకి పవన్ ఫోటోలను వాడుకున్నారు.
గాజువాక నుంచి అభ్యర్థిగా గుడివాడ అమర్నాథ్ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా పలువురు అనుచరులకు పవన్ తో కలిసి ఉన్న పోస్టర్లను పంపిణీ చేశారు. వాటిని ఆయన అనుచరులు ర్యాలీలో ప్రదర్శించారు. పవనన్నకు ప్రాణమిస్తాం.. అమరన్నకు ఓటు వేస్తాం అంటూ స్లోగన్లు కూడా రాసుకొచ్చారు. ఈ ఫ్లెక్సీలు చూసి.. పాపం గుడివాడ అమర్నాథ్ అనుకున్నారు జనసైనికులు. పవన్ కల్యాణ్ ను ఇష్టం వచ్చినట్లుగా తిట్టి ఇప్పుడు ఆయన ఫోటో వాడుకోడవానికి సిగ్గుపడని వ్యక్తిని ఎలా అర్థం చేసుకోవాలో వారికీ అర్థం కావడం లేదు మరి.
వైసీపీ నాయకలకు తాము జగన్ ఫోటోతో వెళ్తే గెలుస్తామని నమ్మకం లేకుండా పోయింది. తమ ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు చెందిన వారి ఫోటోలతో రాజకీయం చేస్తున్నారు. ఎన్టీఆర్ ఫోటోలను కొడాలి నాని, జోరి గమేష్ తమ నామినేషన్ ర్యాలీల్లో వాడుకున్నారు. జగన్, వైఎస్ ఫోటోలతో ఓట్లు పడవని వైసీపీ నేతలు డిసైడయ్యారని .. బయట వాళ్ల ఫోటోలతో ఓట్ల కోసం ప్రయత్నిస్తున్నారన్న సెటైర్లు ఈ కారణంగానే వస్తున్నాయి.