ప్రధాని మోడీ ఏపీ ఎన్నికల పర్యటన ఖరారు అయింది.మే 3, 4తేదీలలో మోడీ ఏపీలో పర్యటించనున్నారు. 3న పీలేరు, విజయవాడలో పర్యటించనున్నారు. 4న రాజమండ్రి, అనకాపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు మోడీ.
3న మధ్యాహ్నం 2 : 45 కి పీలేరు, సాయంత్రం 6 : 30 కు విజయవాడలో రోడ్ షా నిర్వహించనున్నారు. మరుసటి రోజు 4న మధ్యాహ్నం 3 : 45కు రాజమండ్రి, సాయంత్రం 6 గంటలకు అనకాపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు మోడీ.
ఇప్పటికే ఏపీలో ఓ దఫా ఎన్నికల ప్రచారానికి హాజరైన మోడీ.. తాజాగా మరోసారి ఏపీలో ఎన్నికల ప్రచారానికి హాజరు కానున్నారు. రెండు రోజులపాటు విస్తృత స్థాయిలో కూటమి అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం చేయనున్నారు. మోడీ రాష్ట్ర పర్యటన షెడ్యూల్ ఖరారు కావడంతో ఆయన పాల్గొనే సభలు, రోడ్ షోలపై బీజేపీ రాష్ట్ర నయాకత్వం దృష్టి సారించింది.
ప్రధాని మోడీ పాల్గొనే సభల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరితోపాటు కూటమి నేతలు పాల్గొననున్నారు.