షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ శివార్ సమీపంలోని అలెన్ హోమియో , హెర్బల్ కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రమాద సమయంలో కంపెనీలో 300మంది కార్మికులు ఉన్నారని… ఈ ప్రమాదంలో 20మందికి పైగా మృతి చెందినట్లుగా సమాచారం.
భారీ ఎత్తున ప్రమాదం జరగడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో 50 మంది ఉద్యోగులు లోపలే చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం నుంచి బయటపడేందుకు ఉద్యోగులు ప్రయత్నిస్తున్నా.. పొగలు కమ్ముకోవడంతో వారంతా అరుపులు, కేకలతో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎంతమంది గాయపడ్డారు అనే విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
స్థానికుల సమాచారంతో ఘటన స్థలికి చేరుకున్న5 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ, మంటలు అంతకంతకు ఎగిసిపడుతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు. మంటల వేడిమికి తాళలేక నలుగురు వ్యక్తులు బిల్డింగ్ పై నుంచి దూకారు. అయితే, అకస్మాతుగా ఈ మంటలు చెలరేగడానికి కారణం ఏంటి..? షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమా..? అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.