ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు జరిగింది స్వల్ప గాయమేనని వైసీపీ నేతలు బహిరంగంగా చెప్పినా బ్యాండేజ్ తోనే రెండు వారాలపాటు జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించడం పెద్ద చర్చకు దారితీసింది.
ఇటీవలి చోటుచేసుకున్న ఘటనను కోడికత్తి డ్రామా2 అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. ఇంకెన్ని రోజులు ఈ బ్యాండేజ్ పాలిటిక్స్ అంటూ మీమ్స్ వైరల్ అయ్యాయి.గాయం తీవ్రత తగ్గకపోవడంతోనే బ్యాండేజ్ తీయలేదా..? లేదంటే సానుభూతి కోసమే బ్యాండేజ్ డ్రామా కొనసాగుతుందా..? అని జగన్ బస్సుయాత్ర కొనసాగుతోన్న ఏరియాలో విస్తృత చర్చ జరిగింది.
ఈ విషయం వైసీపీ పెద్దల దృష్టికి చేరిందేమో కానీ, వైసీపీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా జగన్ బ్యాండేజ్ లేకుండా కనిపించడంతో ప్రజల ట్రోలింగ్ దెబ్బకు జగన్ కట్టును తీసేశారని సెటైర్లు వేస్తున్నారు. ఇదే విషయమై నారా లోకేష్ తాజాగా స్పందించారు. ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం … జూమ్ చేసి చూస్తే దెబ్బ మటుమాయం అంటూ ఎద్దేవా చేశారు.
ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం … జూమ్ చేసి చూస్తే దెబ్బ మటుమాయం ??#KodiKathiKamalHassan#KodiKathiDrama2 pic.twitter.com/TDfTC7Vb4k
— Lokesh Nara (@naralokesh) April 27, 2024