రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు అయినా ఇవ్వాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు కానీ.. తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. అసెంబ్లీకే అతి కష్టం మీద ఒక్క సీటు ఇస్తే ఇక పార్లమెంట్ సీటు ఏమిస్తారని ఊరుకున్నారు. కానీ మరో మ్యూనిస్టు పార్టీ సీపీఎం మాత్రం అభ్యర్థులను ప్రకటించింది.
అసెంబ్లీ ఎన్నికల్లో సైతం సీపీఎం విడిగా పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఆఫర్ చేసిన ఒక్క ,అసెంబ్లీ సీటు వద్దని చాలా చోట్ల పోటీ చేసింది. చివరికి తమ్మినేని వీరభద్రం కూడా డిపాజిట్ దక్కించుకోలేకపోయారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తమను అడగడం లేదన్న ఈగోతో ఏమో కానీ.. అభ్యర్థుల్ని ప్రకటించేశారు. నామినేషన్లు కూడా వేశారు. అయితే రేవంత్ రెడ్డి తీరిక చేసుకుని సీపీఎం ముఖ్య నేతల్ని తన ఇంటికి పిలిపించుకున్నారు. గెలిచేది లేదు వచ్చే కాసిని ఓట్లను చీల్చడం ఎందుకని.. మద్దతివ్వాలని కోరారు. దానికి తమ్మినేని వీరభద్రం అంగీకరించారు.
జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి పని చేస్తున్నాయి. అయితే కేరళలో మాత్రం కాంగ్రెస్, , కమ్యూనిస్టులు వేర్వేరు కూటములుగా హోరాహోరీ తలపడుతూంటారు. తెలంగాణలో అలాంటి పరిస్థితి లేకపోయినా క్రమంగా బ లహీనపడిన కమ్యూనిస్టులు.. చట్టసభల్లో ప్రాతినిధ్యం కోసం ప్రధాన పార్టీలతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారు., అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ నమ్మించి హ్యండివ్వడంతో కాంగ్రెస్ పంచన సీపీఐ చేరిపోయింది. సీపీఎం మాత్రం ఆలస్యంగా అదే బాట పట్టింది.