నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో న‌డుస్తున్నారు. నాగ్ ఇప్పుడు మ‌ల్టీస్టారర్ల‌పై దృష్టి పెట్టారు. ఆయ‌న ఎంచుకొంటున్న క‌థ‌ల‌న్నీ అలాంటివే. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌కత్వంలో, ధ‌నుష్ క‌థానాయ‌కుడిగా రూపొందుతున్న ‘కుబేర‌’లో నాగ్ నటిస్తున్న సంగ‌తి తెలిసిందే. నాగ్ కూడా షూటింగ్ లో పాలు పంచుకొంటున్నారు. ర‌జ‌నీకాంత్ సినిమాలో నాగ్ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాతో నాగార్జున మార్కెట్ మ‌రింత పెర‌గ‌డం ఖాయం. మ‌రోవైపు అక్ష‌య్‌కుమార్‌తో ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ చేయ‌డానికి దాదాపుగా రంగం సిద్ధ‌మైంది. న‌వీన్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. జ్ఞాన్‌వేల్ రాజా నిర్మాత‌. షూటింగ్ లో సింహ‌భాగం లండ‌న్‌లో జ‌ర‌గ‌బోతోంది. ఇప్ప‌టికే లొకేష‌న్ రెక్కీ కూడా పూర్త‌య్యింది.

అయితే… సోలో హీరోగానూ నాగ్ బిజీగా ఉండాల‌నుకొంటున్నారు. ఈ సంక్రాంతికి `నా సామిరంగ‌` అంటూ హడావుడి చేశారు నాగ్. 2025 సంక్రాంతికీ ఓ సినిమా విడుద‌ల చేయాల‌న్న భావ‌న‌లో ఉన్నారు. అందుకోసం కొన్ని క‌థ‌లు వింటున్నారు. `నా సామిరంగ‌` ఫేమ్ బిన్నీ చెప్పిన క‌థ‌కు నాగ్ ప‌చ్చ జెండా ఊపార‌ని స‌మాచారం అందుతోంది. దాంతో పాటు సుబ్బు అనే కొత్త ద‌ర్శ‌కుడికీ నాగ్ అవ‌కాశం ఇచ్చార‌ని తెలుస్తోంది. ఇవి రెండూ సోలో హీరో క‌థ‌లే. కాకపోతే కీల‌క‌మైన పాత్ర‌ల్లో కొంత‌మంది స్టార్లు క‌నిపించే అవ‌కాశం ఉంది. అలా.. ఇవి కూడా మ‌ల్టీస్టారర్లు అయిపోతాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మారుతికి ముందే తెలుసా?

రాజ్ తరుణ్ కి హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. రెండు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రాజ్ నుంచి వచ్చాయి. పురుషోత్తముడు, తిరగబడరాస్వామి, భలే ఉన్నాడే. ఈ మూడు ఫ్లాపులే. భలే ఉన్నాడే చాలా...

బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా - బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది....

చిట్‌చాట్‌లతో BRSను చిరాకు పెడుతున్న రేవంత్ !

రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడే మాటలు మీడియాలో హైలెట్ అవుతూంటాయి. వాటిని పట్టుకుని బీఆర్ఎస్ ఆవేశ పడుతోంది . అంతా అయిపోయిన తరవాత తీరిగ్గా.. నేను ఎప్పుడన్నాను అని రేవంత్...

ఢిల్లీ తర్వాత సీఎం కూడా కేజ్రీవాలే ?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు ఢిల్లీ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కొత్త సీఎంగా కేజ్రీవాల్ ఎవరికి చాన్సిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. విచిత్రంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close